https://oktelugu.com/

Ram Charan- Deepika Padukone: చరణ్ కి ఆ హీరోయిన్ అంటే పిచ్చి.. చెర్రీ షాకింగ్ కామెంట్స్.. షాక్ లో ఫ్యాన్స్ !

Ram Charan- Deepika Padukone: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ ఫాలోయింగ్ వచ్చింది. ముఖ్యంగా చరణ్ అంటే.. నార్త్ ఇండస్ట్రీ కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇక కంగనా లాంటి హీరోయిన్ అయితే.. చరణ్ ను అమితాబ్ తో పోల్చింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీస్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ అతన్ని ప్రత్యేకంగా అభిమానిస్తున్నారు. మరి ఇంతకీ చరణ్ కి […]

Written By:
  • Shiva
  • , Updated On : August 23, 2022 / 05:31 PM IST
    Follow us on

    Ram Charan- Deepika Padukone: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ ఫాలోయింగ్ వచ్చింది. ముఖ్యంగా చరణ్ అంటే.. నార్త్ ఇండస్ట్రీ కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇక కంగనా లాంటి హీరోయిన్ అయితే.. చరణ్ ను అమితాబ్ తో పోల్చింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీస్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ అతన్ని ప్రత్యేకంగా అభిమానిస్తున్నారు.

    Ram Charan- Deepika Padukone

    మరి ఇంతకీ చరణ్ కి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా ? తాజాగా బాలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో చరణ్ తనకిష్టమైన హీరోయిన్ విషయంలో ఆసక్తికర కామెంట్లు చేశాడు. చరణ్ మాటల్లోనే.. ‘నాకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొన్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఆమె నటన అంటే చాలా ఇష్టం. అందుకే, నేను ఎక్కువగా ఆమె సినిమాలు చూస్తాను. నాకు దీపికతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.

    Also Read: Bimbisara Collections: ‘బింబిసార’ 19 డేస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్.. సంబరాల్లో ఫ్యాన్స్.. ఇంతకీ ఎన్ని కోట్లు లభామో తెలుసా ?

    ఒకవేళ భవిష్యత్తులో దీపికాతో నటించే అవకాశం వస్తే.. ఆ ఛాన్స్ ను అస్సలు మిస్ చేసుకోను. అంటూ తన మనసులోని కోరికను చరణ్ బయటపెట్టాడు. ఈ మాటలు విని ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఎలాగూ ప్రస్తుతం దీపిక సౌత్ సినిమాల్లో నటించడానికి ఆసక్తిగానే ఉంది. మరి ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు. ప్రస్తుతం దీపికా ‘ప్రాజెక్ట్ K’ లో హీరోయిన్‌గా నటిస్తోంది.

    కాబట్టి, ఆమె చరణ్ సరసన కూడా నటించడానికి అంగీకరిస్తోంది. చరణ్ తో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు. మొత్తమ్మీద ఆర్ఆర్ఆర్ అద్భుత విజయాన్ని సాధించింది. హిందీలో కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకి రూ.178 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందుకుంది.

    Ram Charan- Deepika Padukone

    ప్రస్తుతం చరణ్ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా రాబోతుంది.
    రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నాడు. రాజకీయ డ్రామా అంటే.. సినిమా కాస్త సీరియస్ టోన్ లో సాగనుంది. నిజానికి ఈ సినిమా మొదట ఫ్యామిలీ డ్రామా అన్నారు. కానీ.. ఇది కూడా పొలిటికల్ డ్రామా అని తెలిసే సరికి ఫ్యాన్స్ కి సినిమా పై ఆసక్తి మరింత రెట్టింపు అయింది. కారణం.. పొలిటికల్ డ్రామాలను శంకర్ అద్భుతంగా తీస్తాడు.

    ఈ సినిమాలో మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ ‘అరవింద స్వామి’ మెయిన్ విలన్ గా నటించబోతున్నాడు. చరణ్ తో ఇప్పటికే అరవిందస్వామి ‘ధ్రువ’ సినిమాలో నటించాడు. ఈ కాంబినేషన్ బాగా సక్సెస్ అయ్యింది కూడా. ఇప్పుడు మరోసారి ఈ కలయికలో మరో భారీ సినిమా వస్తోంది. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

    Also Read:Dhanush-Aishwarya: విడాకుల అనంతరం తొలిసారి కలిసిన ధనుష్‌- ఐశ్వర్య.. ఫోటో వైరల్.. సర్ ప్రైజ్ లో ఫ్యాన్స్ !

     

     

    Tags