https://oktelugu.com/

Vijay Devarakonda: లైగర్’ ఫ్లాప్ అయితే పరిస్థితేంటన్న ప్రశ్నకు విజయ్ దేవరకొండ అదిరిపోయే సమాధానం

Vijay Devarakonda: ‘లైగర్’.. విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రం. ఇది హిట్ అయితే మన రౌడీ హీరోగా ఏకంగా ‘ప్యాన్ ఇండియా హీరో’ అయిపోతాడు. పెళ్లి చూపులు లాంటి చిన్న చిత్రంతో మొదలైన విజయ్ దేవరకొండ ప్రస్తానంలో ‘లైగర్’ అని ఒక గొప్ప మలుపులాంటింది. అందుకే ఈ సినిమా కోసం దేశమంతా తిరిగి మరీ విజయ్ దేవరకొండ ప్రచారం చేస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొదలైన విజయ్ ప్రయాణం ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరో ముంగిట […]

Written By:
  • NARESH
  • , Updated On : August 23, 2022 / 06:30 PM IST
    Follow us on

    Vijay Devarakonda: ‘లైగర్’.. విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రం. ఇది హిట్ అయితే మన రౌడీ హీరోగా ఏకంగా ‘ప్యాన్ ఇండియా హీరో’ అయిపోతాడు. పెళ్లి చూపులు లాంటి చిన్న చిత్రంతో మొదలైన విజయ్ దేవరకొండ ప్రస్తానంలో ‘లైగర్’ అని ఒక గొప్ప మలుపులాంటింది. అందుకే ఈ సినిమా కోసం దేశమంతా తిరిగి మరీ విజయ్ దేవరకొండ ప్రచారం చేస్తున్నాడు.

    Vijay Devarakonda

    క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొదలైన విజయ్ ప్రయాణం ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరో ముంగిట నిలిచింది. ఇది కనుక హిట్ అయితే విజయ్ రేంజ్ ఎక్కడికో వెళుతుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ, ముంబై, కోల్ కతా, బెంగళూరు సహా అంతటా ప్రచారాన్ని విజయ్ హోరెత్తిస్తున్నాడు. అంతటా విజయ్ కు ప్రేక్షకాదరణ దక్కుతోంది. ఒక యువతి అయితే రింగ్ ఇచ్చి మరీ విజయ్ కు ప్రపోజ్ చేసిందంటే ఆ క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు.

    Also Read: Ram Charan- Deepika Padukone: చరణ్ కి ఆ హీరోయిన్ అంటే పిచ్చి.. చెర్రీ షాకింగ్ కామెంట్స్.. షాక్ లో ఫ్యాన్స్ !

    వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న విజయ్ కు తాజాగా ఒక సూటి ప్రశ్న ఎదురైంది. ‘ఒకవేళ లైగర్ ఫ్లాప్ అయితే మీ పరిస్థితి ఏంటి?’ అని.. నిజంగా మన రౌడీ బాయ్ ముందు ‘లైగర్’కు ముందు ఈ ప్రశ్న వేస్తే వాడి ముక్కు పచ్చడయ్యేది. కానీ ఇప్పుడు చాలా ఎదురుదెబ్బలు తగలడంతో మన వాడు చాలా కూల్ గానే ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.

    Vijay Devarakonda

    ‘లైగర్ ఫ్లాప్ అవ్వడం అన్నది చాలా చిన్న విషయం. దానికి కోపంతో ఊగిపోవాల్సిన పనిలేదు. నాకు కోపం ఎక్కువ. కొన్నాళ్ల కిందట ఈ ప్రశ్న అడిగితే మీపై విరుచుకుపడి మరీ సమాధానం ఇచ్చేవాడిని. కానీ కొన్ని రోజులుగా అభిమానులు చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేసింది. నాకు ప్రేక్షకులే ముఖ్యం. వాళ్ల కోసమే సినిమా చేశాను. ప్రచారంలో వాళ్ల ప్రేమను గెలుచుకున్నా.. అందుకే లైగర్ ఫ్లాప్ అయినా బాధపడను’ అంటూ చాలా ప్రశాంతంగా విజయ్ దేవరకొండ సమాధానం ఇచ్చాడు.

    దీన్ని బట్టి మన రౌడీ బాయ్ లో చాలా మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. అర్జున్ రెడ్డి టైంలో సినిమాను అడ్డుకున్న కాంగ్రెస్ నేత వీ హనుమంతరావుపై సీరియస్ అయిన విజయ్.. ఇప్పుడు లైగర్ వరకూ వచ్చేసరికి ఎంతో ప్రశాంత చిత్తంగల వాడిగా మారాడు. ఇటీవల ఇంటర్వ్యూల్లో.. వ్యవహారశైలిపై విమర్శలు రావడంతో తన సహజశైలికి భిన్నంగా కాస్త తగ్గి కూల్ నెస్ ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది.

    Also Read:Dhanush-Aishwarya: విడాకుల అనంతరం తొలిసారి కలిసిన ధనుష్‌- ఐశ్వర్య.. ఫోటో వైరల్.. సర్ ప్రైజ్ లో ఫ్యాన్స్ !

    Tags