Ram Charan: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్రం రెండో షెడ్యూల్ షూటింగ్ ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో జరగనుంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్ లో రామ్ చరణ్ పై ఫైటింగ్ సీన్స్ ను చిత్రీకరించనున్నారు.

ఆ వెంటనే అమృత్ సర్ లోనూ షూటింగ్ జరగనుంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు. అతనికి జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. నిజానికి జనవరి 2 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ లాంగ్ ఫైట్ షూటింగ్ స్టార్ట్ చేయాలి. అయితే, అప్పుడు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉండటంతో తప్పక షూటింగ్ పోస్ట్ ఫోన్ చేశారు.
Also Read: రాహుల్ రామకృష్ణకి తిక్క అట.. మాట మీద నిలబడే రకం కాదట !
అలాగే చరణ్ సంక్రాంతి తర్వాత డేట్స్ ఇస్తాను అని శంకర్ కి క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే చరణ్, శంకర్ సినిమాకి వరుస డేట్స్ ఇచ్చాడు. ఫిబ్రవరి మూడో వారం వరకు తన డేట్స్ ను ఈ సినిమా కోసమే చరణ్ కేటాయించాడట. అన్నట్టు శంకర్ ఈ సినిమాతో తన దర్శకత్వ పరిధిని పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.

ఇప్పటికే గొప్ప విజువల్ సినిమాలను తీస్తూ.. పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్కెట్ తెచ్చుకున్నాడు శంకర్. అయితే, ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లాలని ఆశ పడుతున్నాడు. వాస్తవానికి మొట్టమొదటి పాన్ ఇండియా డైరెక్టర్ శంకరే. అంత అద్భుతమైన రికార్డు ఉంది ఆయనకు.
ఇక ‘రామ్ చరణ్ తో చేస్తోన్న ఈ భారీ బడ్జెట్ సినిమాని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నాడట. ఈ సినిమా పై నేషనల్ వైడ్ గా విపరీతమైన బజ్ ఉంది. అన్నట్టు ఈ భారీ పాన్ ఇండియా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రహమాన్ మ్యూజిక్ అందించబోతున్నాడు.
Also Read: నెలకు రూ.2 లక్షల వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?