https://oktelugu.com/

Samatha Murthy Statue: సమతామూర్తి విగ్రహ నిర్మాణంలో ప్రత్యేకతలు ఇవే..

Samatha Murthy Statue: రంగారెడ్డి జిల్లా మచ్చింతల్ లోని రామానుజుల విగ్రహ ఏర్పాటులో భాగంగా సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇందులో సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు సైతం పాల్గొన్నారు. విగ్రహాన్ని పరిశీలించారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను సైతం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అన్ని పనులను చినజీయర్ స్వామి దగ్గరుండి చూసుకుంటున్నారు. శనివారం రోజున ప్రధాని మోడీ ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. ఈ విగ్రహంలో అనేక […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 5, 2022 / 01:09 PM IST
    Follow us on

    Samatha Murthy Statue: రంగారెడ్డి జిల్లా మచ్చింతల్ లోని రామానుజుల విగ్రహ ఏర్పాటులో భాగంగా సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇందులో సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు సైతం పాల్గొన్నారు. విగ్రహాన్ని పరిశీలించారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను సైతం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అన్ని పనులను చినజీయర్ స్వామి దగ్గరుండి చూసుకుంటున్నారు. శనివారం రోజున ప్రధాని మోడీ ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. ఈ విగ్రహంలో అనేక ప్రత్యేకతలున్నాయి.

    Samatha Murthy Statue

    2013 లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. ఇందుకు సంబంధించి 2014లో పనులను ప్రారంభించారు. మొదటగా రామానుజులకు సంబంధించి 14 రకాలైన నమూనాలను తయారు చేయించారు చినజీయర్ స్వామి. అందులో మొదటగా మూడించిన ఎంపిక చేశారు. అందులో కొన్ని మార్పులు చేశారు. ఫైనల్ గా ఒక నమూనాను తయారు చేయించారు. తర్వాత దానిని 3డీ స్కానింగ్ చేయించి, ఆబ్జెక్ట్ ఫైల్ రూపంలో మార్పించారు. అనంతరం పలు సాఫ్ట్ వేర్ల ద్వారా దానిని మరింత అందంగా రూపొందించారు. పలు చిన్న చిన్న అంశాలపై కూడా చాలా శ్రద్ధ వహించారు. ఇందుకోసం రోజుకు సుమారు 19 గంటల పాటు 22 రోజులు కష్టపడ్డారు.

    Also Read: Samatamoorthy Statue: సమతామూర్తి రామానుజం టెంపుల్ ప్రత్యేకత.. ముచ్చింతల్ కు ఆర్టీసీ బస్సులు, రైళ్లు రూట్స్ ఇవే!

    చినజీయర్ స్వామి సైతం ఇందుకోసం ప్రతి రోజు దాదాపుగా 3 గంటలు కేటాయించి పలు సలహాలు, సూచనలు చేశారు. సాఫ్ట్ వేర్ పనులు పూర్తయ్యాక దానిని దానిని రోబోటిక్ టెక్నికల్ సహాయంతో ఓ నమూనాను తయారు చేయించారు. తర్వాత సాఫ్ట్ వేర్ ద్వారా మరికొన్ని మార్పులు చేశారు. అనంతరం దానిని చైనాకు పంపించారు. అనంతరం విగ్రహం 1600 ముక్కలుగా తయారు చేశారు. అనంతరం దానిని తీసుకువచ్చి.. అప్పటికే తయారుచేసిన స్టీల్ నిర్మాణంపై లేయర్ల మాదిరిగా అతికించారు. ఇందుకోసం 70 మంది నిపుణులు కష్టపడ్డారు.

    ఇది పూర్తి కావడానికి దాదాపుగా 15 నెలల టైం పట్టింది. ఈ విగ్రహం పంచలోహాలతో తయారైంది. ఇప్పటికే సహస్రాబ్ది ఉత్సవాలు ప్రారంభం కావడంతో చాలా మంది భక్తులు అక్కడికి చేరుకుని ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ వేడుకలను సైతం మునుపెన్నడూ చూడని విధంగా జరుపుతుండటం విశేషం. ఈ ఉత్సవాల్లో భజనలు, పాటలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తాజాగా సీఎస్ సోమేశ్ కుమార్ సైతం ఉత్సహలకు హాజరై ఏర్పాట్లను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో సీఎం సతీమణి సైతం పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు సైతం ఇప్పటికే విగ్రహాన్ని సందర్శించారు. ఏర్పాట్లకు సంబంధించి పలు విషయాలపై మాట్లాడారు.

    Also Read: నేడు మోడీ రాక.. సమతమూర్తి రామనుజ విగ్రహావిష్కరణ.. ఇక్రిసాట్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..