RRR Movie: దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మెగా, నందమూరి ఫ్యామిలిలకు చెందిన ఇద్దరూ స్టార్ హీరోలతో కలిసి దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియోస్ నెట్టింట్లో సంచలన రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. కాగా ఈ సినిమా ట్రైలర్ ను రేపు ( డిసెంబర్ 9 న ) విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
అయితే ఇప్పుడు తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ ను రేపు ఉదయం 10 గంటల నుంచి సినిమా థీయేటర్స్ లలో విడుదల చేస్తామని చిత్ర బృందం అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అలాగే ఈ సినిమా ట్రైలర్ ను యూట్యూబ్ లో రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తున్నట్టు మూవీ యూనిట్ వెల్లడించింది. ఈ అప్డేట్ తో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా … మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కలిసి నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్ ను విడుదల చేయనున్నారు.
GET READY to witness the TRAILER of INDIA’s BIGGEST FILM, in Theatres at 10 AM and on Youtube from 4 PM tomorrow… 💥💥💥💥🤘🏻#RRRTrailer #RRRMovie@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @DVVMovies @RRRMovie pic.twitter.com/aymwBjIBYa
— RRR Movie (@RRRMovie) December 8, 2021