https://oktelugu.com/

పాపం కీర్తి సురేష్ ను వదిలేలా లేరు !

ఏ సినిమాకైనా ముందు అసలు టైటిల్ కంటే కూడా.. వర్కింగ్ టైటిల్ నే ముందు పెట్టుకుంటూ ఉంటారు. తీరా ఆ టైటిల్ జనంలోకి వెళ్ళాక ఇక చేసేదేం లేక చివరకు ఆ వర్కింగ్ టైటిల్ నే.. అసలు టైటిల్ గా ప్రకటిస్తారు. ఒక్కోసారి వర్కింగ్ టైటిల్ ను మధ్యలోనే వదిలేసి.. చివర్లో అసలు టైటిల్ అంటూ మరో టైటిల్ ను ప్రకటిస్తారు. ఇక కొన్నిసార్లు ఆల్రెడీ టైటిల్ ప్రకటించి, దాని స్థానంలో కొత్తగా మరో పేరు పెట్టిన […]

Written By:
  • admin
  • , Updated On : November 25, 2020 4:09 pm
    Follow us on

    Keerthy Suresh first film
    ఏ సినిమాకైనా ముందు అసలు టైటిల్ కంటే కూడా.. వర్కింగ్ టైటిల్ నే ముందు పెట్టుకుంటూ ఉంటారు. తీరా ఆ టైటిల్ జనంలోకి వెళ్ళాక ఇక చేసేదేం లేక చివరకు ఆ వర్కింగ్ టైటిల్ నే.. అసలు టైటిల్ గా ప్రకటిస్తారు. ఒక్కోసారి వర్కింగ్ టైటిల్ ను మధ్యలోనే వదిలేసి.. చివర్లో అసలు టైటిల్ అంటూ మరో టైటిల్ ను ప్రకటిస్తారు. ఇక కొన్నిసార్లు ఆల్రెడీ టైటిల్ ప్రకటించి, దాని స్థానంలో కొత్తగా మరో పేరు పెట్టిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే మహానటితో మంచి ఫాలోయింగ్ సంపాదించిన కీర్తిసురేష్ నటిస్తున్న ఓ సినిమాకు మాత్రం ముచ్చటగా మూడోసారి టైటిల్ మారుస్తున్నారని తెలుస్తోంది. పైగా ఆ సినిమా కూడా ఇప్పటి సినిమా కాదు.

    Also Read: ‘అంధకారం’ మూవీ రివ్యూ.. హిట్టా.. ఫ్లాఫా?

    కీర్తి సురేష్ హీరోయిన్ గా అడుగుపెట్టిన తొలినాళ్లలోని సినిమా అది. అప్పట్లో కీర్తిసురేష్ హీరోయిన్ గా, నవీన్ విజయకృష్ణ హీరోగా ఓ సినిమా షూటింగ్ మొదలై అప్పుడే ఆగిపోయిన సంగతి చాలామందికి గుర్తుకుఉండకపోవచ్చు గాని, ఆ సినిమా మేకర్స్ మాత్రం సినిమాని అంత తేలిగ్గా వదిలేలా లేరు. “జానకితో నేను” అనే టైటిల్ పెట్టారు అప్పుడు. ఆ తర్వాత కొన్ని రోజులకు “అయినా ఇష్టం నువ్వు” అనే టైటిల్ ను పెట్టుకున్నారు. ఇలా టైటిల్స్ అయితే మార్చారు గాని, సినిమాని మాత్రం పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు తాజాగా “రెండు జళ్ల సీత” అనే టైటిల్ ను పెట్టాలనుకుంటున్నారట.

    Also Read: బిగ్‌బాస్‌ ఫైనల్‌ విన్నర్‌‌ అతనేనా..?

    కొత్త టైటిల్ తో కొత్త సినిమా అనే కలరింగ్ ఇవ్వడానికి మేకర్స్ బాగా కష్టపడుతున్నారు. ఏది ఏమైనా కీర్తి సురేష్ కి ఇప్పుడు ఉన్న క్రేజ్ ని యూజ్ చేసుకోవడానికి మేకర్స్ బాగా ప్లాన్ చేసుకున్నారు. అందుకే ఈ “పాత” సినిమాని కొత్తగా రిలీజ్ చేసే ప్రయత్నాలు షురూ చేసారు. ఇన్నీ చేసినా సినిమాలో కీర్తిని చూస్తే అర్ధం అయిపోతుంది. ఇది ఇప్పటి సినిమా కాదు అని. అన్నట్లు చంటి అడ్డాల ఈ సినిమాకు నిర్మాత. ఆయన ఈ సినిమా హక్కుల్ని తనకు అమ్మేశారని మరో నిర్మాత నట్టికుమార్ వాదిస్తూ .. తన దగ్గర బాండ్ పేపర్ సాక్ష్యాలు కూడా ఉన్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. అసలుకే పాత సినిమా.. మళ్ళీ ఈ గొడవలు ఎందుకో. ఎప్పుడో ఒప్పుకున్న పాపానికి.. మొత్తానికి పాపం కీర్తిసురేష్ ను వదిలేలా లేరు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్