తెలంగాణలో ఆంధ్ర పార్టీలకే స్పేస్‌ లేనట్లే..

తెలంగాణ ఉద్యమం చరిత్రలో నిలిచిపోయేలా సాగింది. ఎంతలా అంటే.. ఆంధ్ర పాలకులతో తమకు జరుగుతున్న నష్టాన్ని నరనరాన ఎక్కించేసుకున్నారు ఇక్కడి ప్రజలు. ఇక్కడి పాలకులు కూడా ప్రజలను అంతలా ప్రభావితం చేయగలిగారు. అందుకే.. తెలంగాణ ఏర్పడిన చరిత్ర తెలిసిన అంధ్రులు ఎవరైనా అక్కడ పోటీ అంటే ఆలోచించుకోవాల్సిందే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు అయినా తెలంగాణలో ఇప్పటికీ చంద్రబాబు రాజకీయ‌ ఉనికిని చాటుకోలేకపోతున్నారు. ఇక జగన్‌కు తన సొంత సామాజికవర్గం బలం తెలంగాణలో ఫుల్లుగా ఉంది. పైగా […]

Written By: NARESH, Updated On : November 25, 2020 5:31 pm
Follow us on

తెలంగాణ ఉద్యమం చరిత్రలో నిలిచిపోయేలా సాగింది. ఎంతలా అంటే.. ఆంధ్ర పాలకులతో తమకు జరుగుతున్న నష్టాన్ని నరనరాన ఎక్కించేసుకున్నారు ఇక్కడి ప్రజలు. ఇక్కడి పాలకులు కూడా ప్రజలను అంతలా ప్రభావితం చేయగలిగారు. అందుకే.. తెలంగాణ ఏర్పడిన చరిత్ర తెలిసిన అంధ్రులు ఎవరైనా అక్కడ పోటీ అంటే ఆలోచించుకోవాల్సిందే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు అయినా తెలంగాణలో ఇప్పటికీ చంద్రబాబు రాజకీయ‌ ఉనికిని చాటుకోలేకపోతున్నారు. ఇక జగన్‌కు తన సొంత సామాజికవర్గం బలం తెలంగాణలో ఫుల్లుగా ఉంది. పైగా జగన్, వైఎస్సార్ అభిమానులు కూడా దండీగా ఉన్నారు. అయినా వైసీపీ తెలంగాణ వైపు చూడడంలేదు. మరి జనసేనకు కూడా తెలంగాణలో ఉనికి చాటుకోవాలని చాలానే ఆశ ఉంది.

Also Read: అమరావతి కుంభకోణం: హైకోర్టు గాగ్ ఆర్డర్ పై సుప్రీం స్టే

అగ్రదేశం అమెరికాలో సైతం తెలుగు వారు గెలిచి సెనైట్‌ వరకు వెళ్లారు. కానీ.. తెలంగాణలో మాత్రం ఇప్పటికిప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఆంధ్ర రాజకీయ నేతలు ఇక్కడ పాగా వేసే అవకాశాలు కనిపించడం లేదు. ఆంధ్రా యాంటీ సెంటిమెంట్‌ ప్రజల్లో కూడా అంత బలంగా నాటుకుపోయింది. 2018 ఎన్నికల్లోనూ మరోసారి కేసీయార్ ఆ బూచీనే వాడి లాభాన్ని పొందారు. చంద్రబాబుతో పొత్తు వల్ల కాంగ్రెస్ కుదేల్ అయింది. ఇక్కడ పోటీ చేయడం ముఖ్యం కాదు, పోటీ చేసి గెలిచినా తెలంగాణను తెచ్చిన టీఆర్‌‌ఎస్‌ రాజకీయ వత్తిడులకు లొంగి పనిచేయాలి. ఇప్పట్లో అయితే తెలంగాణలో వేరే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మాత్రం లేవు. అలాంటపుడు పోటీ చేసి ఒకటి రెండు చోట్ల డివిజన్లు గెలుచుకున్నా టీఆర్‌‌ఎస్‌లోకి వెళ్లడం ఖాయం. ఈ మాత్రం దానికి టికెట్ ఇచ్చి పోటీకి పెట్టి ఇంత ఆయాసపడడం వేస్టే కదా అని కాంగ్రెస్‌ అభిప్రాయం.

తెలంగాణను తామే తెచ్చాం, తమకే పాలించే హక్కు ఉందని టీఆర్ఎస్ ఢంకా భజాయిస్తోంది. ఇక తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ కానీ, మద్దతు ఇచ్చిన బీజేపీ కానీ సోదిలోకి రాకుండా పోతున్నాయి. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతవరకూ ఆంధ్రా మూలాలు ఉన్న పార్టీలు తెలంగాణలో ఎక్కడ నుంచి అయినా పోటీ చేయాలంటే సాహసం చేయాల్సిందే. పోటీ చేసినా గెలిచినవారు మళ్లీ టీఆర్‌‌ఎస్‌కే జై కొడతారు. దాన్ని కూడా భరించాలి. ఇక కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ అధికారంలోకి వస్తే మాత్రం సీన్ వేరేగా ఉంటుంది. ఆ రెండూ జాతీయ పార్టీలు కావడం, వాటికి ఆంధ్రాతో కూడా రాజకీయ అవసరాలు ఉండడంతో ఆంధ్రా పార్టీలు తెలంగాణలో రాజకీయ వాటా కోసం పోటీ పడేందుకు వీలు ఉంటుంది.

Also Read: రైతులకు గుడ్ న్యూస్.. సులభంగా రూ.5 లక్షలు లోన్ పొందే ఛాన్స్..?

అందుకే.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలే తమకు తాముగా పొలిటికల్ స్పేస్ పెంచుకుని టీఆర్‌‌ఎస్‌ను గద్దె దించే ప్రయత్నం చేయాలి. ఓ వైపు క్యాడర్ ఉన్నా ప్రజాకర్షణ కలిగిన లీడర్లు లేని దైన్యంలో కాంగ్రెస్ ఉంది. బీజేపీకి కొన్ని చోట్ల బలం తప్ప తెలంగాణ అంతటా ప్రభావం లేదు. పైగా ఈ రెండు పార్టీలు ఎప్పటికీ కలిసే సీన్ లేదు. ఇప్పటికైతే ఇది మారని సీన్. దాంతో టీఆర్ఎస్ రథం నల్లేరు మీద బండిలా సాగిపోవాల్సిందే. ఏది ఏమైనా ఫ్యూచర్‌‌ రాజకీయాలను మాత్రం జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయనేది స్పష్టం.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్