https://oktelugu.com/

Chandramukhi 2 Movie: ‘చంద్రముఖి-2’ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

2005 ఏప్రిల్ 14న రిలీజైన ఈ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ఇందులో ప్రధాన పాత్రలుగా నటించారు. నయనతార ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 15, 2023 / 12:41 PM IST

    Chandramukhi 2 Movie

    Follow us on

    Chandramukhi 2 Movie: హరర్ అండ్ సస్పెన్స్.. సూపర్ స్టోరీ.. స్టార్ నటుల యాక్షన్.. ఇలా అన్నీ కలగలిపి వెండితెరపైకి వచ్చిన చిత్రం చంద్రముఖి. ఏమాత్రం అంచనాలు లేకుండా ఈ మూవీ థియేటర్లోకి వచ్చి.. కొన్ని రోజుల తరువాత బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. కంటెంట్ ఉంటే సినిమా ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతుందని చంద్రముఖి నిరూపించింది. ఇందులో నటులు యాక్షన్ ఎవరికి వారే సాటి అని చెప్పొచ్చు. ముఖ్యంగా జ్యోతిక ఫర్ఫామెన్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆ తరువాత ఇలాంటి పాత్రనే ఇతర నటీమణులు చేసినా ఆకట్టుకోలేదు. అయితే ఈ మూవీ సీక్వెన్స్ ఉంటుందని ఎప్పటి నుంచో అంటున్నారు. మొత్తానికి 17 ఏళ్ల తరువాత షూటింగ్ ప్రారంభించారు. మరి కొన్ని రోజుల్లో దీని షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. త్వరలో థియేటర్లో కి ‘చంద్రముఖి 2’ భయపెడుతుందన్న చర్చ సాగుతోంది.

    వాస్తవానికి చంద్రముఖి కథతో మలయాళంలో, కన్నడంలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అక్కడ యావరేజ్ సక్సెస్ సాధించాయి. ఇదే కథను తమిళ డైరెక్టర్ పి. వాసు ‘చంద్రముఖి’ పేరుతో వెండితెరపైకి తీసుకొచ్చారు. ఆ తరువాత తెలుగులో రిలీజ్ చేశారు. అయితే తమిళంలో కంటే తెలుగులోనూ చంద్రముఖి బిగ్గెస్టు హిట్టుగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ టీవీల్లో చంద్రముఖి సినిమా వస్తే చూడని వారు ఉండరు.

    2005 ఏప్రిల్ 14న రిలీజైన ఈ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ఇందులో ప్రధాన పాత్రలుగా నటించారు. నయనతార ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తరువాత ఈమె తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లింది. రజనీకాంత్ అప్పటి వరకు కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. మరోసారి ‘చంద్రముఖి’తో తన కెరీర్ మలుపు తిరిగింది. ఇక జ్యోతిక అప్పటికే తెలుగు చిత్రసీమకు పరిచయం అయింది. చంద్రముఖి తరువాత ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది.

    చంద్రముఖి ఫస్ట్ మూవీని తీసిన డైరెక్టర్ పి. వాసు 17 ఏళ్ల తరువాత చంద్రముఖి 2ను ఆయనే తీస్తున్నారు. అయితే ఇప్పుడు నటులు చేంజ్ అయ్యారు. రజనీకాంత్ ప్లేసులో లారెన్స్ వచ్చారు. జ్యోతిక ప్లేస్ లోకి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రానౌత్ ఎంట్రీ ఇచ్చారు. అయితే చంద్రముఖి మొదటి పార్ట్ కు కంటినేషన్ ఉంటుందా? లేకా కథను మారుస్తారా? అనేది సస్పెన్షన్ గా ఉంది. ఈ మూవీ షూటింగ్ మరో 10 రోజుల్లో పూర్తి చేసుకుంటుందని సినీ బృందం తెలిపింది. అంటే 2023 సెప్టెంబర్ లో వినాయక చవితి సందర్భంగా థియేరట్లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.