Chandrababu, Lokesh reaction on bheemla nayak: అటు పవన్ కల్యాణ్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ తో పాటు ఇటు సామాన్య సినీ ప్రేక్షకుడు ఎంతగానో ఎదరు చూసిన భీమ్లానాయక్ ఈరోజు వచ్చేశాడు. వస్తూనే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్నాడు పవన్ ఫ్యాన్స్ ఏం కోరుకున్నారో.. అవన్నీ ఈ మూవీలో ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు అభిమానులు.

దీంతో ఈ మూవీ సామాన్య జనం దగ్గరి నుంచి సినీ సెలబ్రిటీల వరకు అందరూ స్పందిస్తున్నారు. ఇక తాజాగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా ఈ మూవీ మీద స్పందించడం గమనార్హం. చంద్రబాబు ట్విట్టర్ లో ఈ మూవీ గురించి వరుస ట్వీట్లు చేశారు. భీమ్లా నాయక్ మీద జగన్ ప్రభుత్వ కక్ష్యం సాధింపు చర్యలను ఆయన ఖండించారు. రెవెన్యూ ఉద్యోగులను థియేటర్ల దగ్గర పెట్టడం ఏంటని మండిపడుతున్నారు.
Also Read: సినీ పరిశ్రమపై జగన్ కు ఎందుకంత కోపం?
ఒక్క సినిమాను అడ్డుకునేందకు ఇన్ని కుట్రలు చేయడం ఏంటని ప్రశ్నించారు. భీమ్లానాయక్ మూవీ పట్ల జగన్ చర్యలు చూస్తుంటే.. ఉగ్రవాదాన్ని తలపిస్తోందంటూ ఆగ్రహం తెలిపారు. ఇక టీడీపీ ఎప్పుడూ తప్పును నిలదీస్తుందని, ఇప్పుడు భీమ్లానాయక్ పట్ల ప్రభుత్వ చేస్తున్న కక్ష్య సాధిపు చర్యలను ఆపేసి ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ ప్రజలను రక్షించాలంటూ సూచించారు.

ఇక అటు నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు. ఈ మూవీకి అద్భుతమైన స్పందన వస్తోందని, తాను కూడా మూవీ చూసేందుకు ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. అయితే జగన్ ప్రభుత్వం ఈ మూవీ చేస్తున్న కుట్రలను జయించి ముందుకు సాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. అయితే ఈ ఇద్దరి రియాక్షన్ చూస్తుంటే.. పవన్ మూవీ మీద జగన్ ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నట్టు అర్థం అవుతోంది. ఇప్పటికే పవన్ తో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు పవన్ మీద ఉన్న ప్రేమను ఈ రకంగా చూపించారంటూ చర్చించుకుంటున్నారు. ఇక వీరి ట్వీట్లను పవన్ ఫ్యాన్స్ రీ ట్వీట్ చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు.
Also Read: యుద్ధంలో నలిగిపోతున్న ‘ఆర్ఆర్ఆర్’ లొకేషన్ !