Suhasini Maniratnam: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన సుహాసిని నటనకు పెట్టింది పేరు. అత్యంత సహజ సిద్ధమైన నటనతో ఆమె ప్రేక్షకుల మదిని కొల్లగొట్టారు. 1990వ దశకంలో మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని జోడీ సూపర్ హిట్ అని పేరు తెచ్చుకుంది. సౌత్ లోని స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన ఆమె.. సహసిద్ధమైన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తియ్యనైన మాటలతో ప్రతి పాత్రలో కూడా చాలా మెతక మనిషిగానే కనిపించింది.

ఆమె నెగెటివ్ రోల్స్ చేసిన సినిమాలు చాలా అంటే చాలా తక్కువ. ఎంతసేపు ఒకరికి మంచి చేసే క్యారెక్టర్ లోనే కనిపించింది. తనకు పేరు వస్తుందా రాదా అన్నది పక్కన పెట్టేసి ఇలాంటి పాజిటివ్ క్యారెక్టర్లను మాత్రమే ఆమె ఎంచుకునేది. ఇక లెజెండ్ డైరెక్టర్ మణిరత్నంతో పెండ్లి తర్వాత ఆమె చాలా రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
Also Read: ‘ప్రభాస్’ ఫ్యాన్స్ కు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు !
ఆ మధ్య తల్లి పాత్రల్లో, అత్త పాత్రల్లో నటించి ప్రేక్షకుల మదిని దోచేసింది. అయితే ఇన్ని రోజులు కథలో మార్పు తీసుకు వచ్చ ఒక మంచి మహిళ పాత్రల్లోనో లేదంటే అధికారి పాత్రల్లోనే నటించిన సుహాసిని.. మొదటి సారి ఓ చాలెంజింగ్ రోల్‌లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ఫోకస్ మూవీలో చేస్తోంది. జి.సూర్య తేజ డైరెక్షన్ లో వస్తున్న ఫోకస్ మూవీని స్కైరా క్రియేషన్స్ నిర్మిస్తోంది. విజయ్ శంకర్, అషు రెడ్డి మెయిన్ రోల్స్ చేస్తుండగా.. ఇందులో సుహాసిని అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తోంది.

ఇంకా చెప్పాలంటే కథను మలుపు తిప్పే పాత్రగా తెలుస్తోంది. ఈ మూవీలో ఆమె ఫస్ట్ లుక్‌ను విజయేంద్రప్రసాద్ విడుదల చేశారు. దీన్ని చూస్తుంటే.. కోర్టు సన్నివేశాల చుట్టూ సాగే కథ అని తెలుస్తోంది. ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇందులో ఆమె కోర్టు చుట్టూ తిరిగి సమస్యల పరిష్కారం కోసం పోరాడే పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. ఈ మూవీ ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నట్టు డైరెక్టర్ సూర్యతేజ తెలిపారు. వచ్చే మార్చి నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: యుద్ధంలో నలిగిపోతున్న ‘ఆర్ఆర్ఆర్’ లొకేషన్ !