https://oktelugu.com/

Ram Gopal Varma Maa Ishtam Movie: హేయ్.. వివాదాస్పద వర్మ షాక్ ఇచ్చాడుగా !

Ram Gopal Varma Maa Ishtam Movie: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు ఇవ్వాల్సిన రూ.5 కోట్ల 29 లక్షలు ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడని.. నిర్మాత నట్టి కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నట్టి కుమార్ తో గతంలో వర్మ కొన్ని సినిమాలు చేశారు. కానీ, ఆ సినిమాలు ఏవీ ఆడలేదు. మరి వీరిద్దరూ మధ్య ఏ ఒప్పందం జరిగిందో తెలియదు. వర్మ ప్రతి సినిమాకు నట్టి కుమార్ కి రూ.50 […]

Written By:
  • Shiva
  • , Updated On : April 20, 2022 / 07:08 PM IST
    Follow us on

    Ram Gopal Varma Maa Ishtam Movie: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు ఇవ్వాల్సిన రూ.5 కోట్ల 29 లక్షలు ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడని.. నిర్మాత నట్టి కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నట్టి కుమార్ తో గతంలో వర్మ కొన్ని సినిమాలు చేశారు. కానీ, ఆ సినిమాలు ఏవీ ఆడలేదు. మరి వీరిద్దరూ మధ్య ఏ ఒప్పందం జరిగిందో తెలియదు. వర్మ ప్రతి సినిమాకు నట్టి కుమార్ కి రూ.50 లక్షలు ఇవ్వాలన్న నిబంధనలు ఉన్నాయట. ఇప్పుడు ఆ నిబంధనలు పాటించడం లేదని నట్టి కుమార్ ఆరోపిస్తున్నారు.

    Ram Gopal Varma

    దీంతో ఆర్జీవీ తాజా చిత్రం ‘మా ఇష్టం’ మూవీ రిలీజ్‌ను ఆపాలంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘మా ఇష్టం డేంజరస్’ మూవీ వాయిదా పడింది. అయితే, ఈ వివాదం పై తాజాగా వివాదాస్పద దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.

    Also Read: Ashokavanamlo Arjuna Kalyanam: ట్రైలర్ టాక్: అర్జున క‌ళ్యాణంలో మలుపుల మయం !

    వర్మ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. అందులో ఏముందంటే.. ‘‘గత కొద్ది రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్న నట్టి కుమార్, నట్టి క్రాంతి, నట్టి కరుణల విషయమై ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నాను. ఏప్రిల్ 8, 2022న మూడు భాషల్లో రిలీజ్‌కి సిద్దంగా ఉన్న నా డేంజరస్ చిత్రాన్ని ఆపటానికి నట్టి క్రాంతి, నట్టి కరుణ లు కుట్ర పన్ని, ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ ఆధారంగా 5వ జూనియర్ సివిల్ జడ్జి, సిటీ సివిల్ కోర్టులో పిటీషన్ ఫైల్ చేసి చిత్రాన్ని అడ్డుకున్నారు. ఆ క్రింది కోర్టు ఇచ్చిన ఇంజుంచ్తిఒన్ ఆర్డర్‌ని ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. నేను ఇప్పుడు నట్టి క్రాంతి, నట్టి కరుణల మీద ఫోర్జరీ కి సంబంధించిన కేసే కాకుండా, వివిధ మీడియా ఛానళ్లలో నా పై చేసిన నిందలు, ఆరోపణలకు సంబంధించి నట్టి క్రాంతి,నట్టి కరుణల ఫాదర్ అయినటువంటి నట్టి కుమార్ మీద.. నేను, తుమ్మలపల్లి రామత్యనారాయణగారు డిఫమేషన్ కేసు వెయ్యటమే కాకుండా రిలీజ్ కి ముందు ఫొర్గెద్ డాక్యుమెంట్‌ని ఉపయోగించి సినిమాని ఆపి, మాకు అపారమైన ఆర్థిక నష్టం కలిగించినందుకు కూడా నేను, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు వాళ్ల మీద డ్యామేజ్ కేసు వెయ్యబోతున్నాము.

    Ram Gopal Varma

    ఇప్పుడు విడుదల చేసేందుకు క్లియరెన్స్‌ ఆర్డర్ వచ్చింది కనుక డేంజరస్ చిత్రాన్ని మే 6న విడుదల చేయబోతున్నాము. దానికి సంబంధించి మాకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ లు కూడా పబ్లిక్ డొమైన్‌లో పెడుతున్నాము. ఫోర్జరీ చేసి, దానిని నిజమైన డాక్యుమెంట్‌గా ఉపయోగించడం ద్వారా నట్టి క్రాంతి, నట్టి కరుణలు చేసిన క్రిమినల్ చర్యలకి సంబంధించిన విషయాలు, అలాగే పైన పేర్కొన్న ఇంజక్షన్-ఆర్డర్‌ను నట్టిలు సేకరించిన విధానాన్ని, యంత్రాంగాన్ని దుర్వినియోగ పరుచుకున్న తీరు.. నట్టి ఫ్యామిలీ యొక్క నేరపూరిత స్వభావాన్ని తెలియజేస్తుంది. ఈ ప్రెస్ నోట్ తప్ప, ఇకపై నేను ఈ విషయంపై ఇంకేం మాట్లాడబోను..జస్ట్ వాళ్ల పైన చట్టపరమైన చర్యలపై మాత్రమే దృష్టి పెడతాను. అతి త్వరలో వాళ్ల అసలు రూపం బయటపడబోతోంది..’’ అని వర్మ పేర్కొన్నారు.

    Also Read:NTR Movie Cancelled: ఎన్టీఆర్ కొత్త సినిమా క్యాన్సిల్ అయ్యిందా?? ఆందోళనలో ఫాన్స్

    Recommended Videos:

    Tags