Pawan Kalyan : పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) నటిస్తున్న చిత్రాలలో ఓజీ(They Call Him OG) క్రేజ్ రోజురోజుకి బౌండరీలు దాటుతుంది. ఆ సినిమా పేరు వినిపిస్తే చాలు, ఏ సభా ప్రాంగణం అయినా ప్రకంపనలతో హోరెత్తిపోతుంది. ఇంత క్రేజ్ ఒక సినిమాకి చూసి మన తెలుగు ఆడియన్స్ చాలా కాలమే అయ్యింది. ‘పుష్ప 2′(Pushpa 2) కి కూడా విడుదలకు ముందు ఈ స్థాయి క్రేజ్ ని చూడలేదు. సుజిత్ కి కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉంది. ఏ స్టార్ హీరో అయినా పెద్ద డైరెక్టర్ తో చేస్తే క్రేజ్ వస్తుంది, అది సహజం. కానీ పవన్ కళ్యాణ్, సుజిత్(Director Sujeeth) తో సినిమాని ప్రకటించినా ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం, నేటి తరం ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ సినిమా తీస్తుండడం వల్లే. ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లినా అభిమానులు ఓజీ, ఓజీ అని నినాదాలు చేయడం ఆయన్ని ఎంతగా ఇబ్బంది పెట్టాయో మన అందరికీ తెలిసిందే.
అయితే నిన్న విజయవాడ లో సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Nayudu) సతీమణి నారా భువనేశ్వరి గారి ఆద్వర్యం లో తలసేమియా వ్యాధి బాధితులకు సహాయం చేయడం కోసం , ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఒక మ్యూజిక్ నైట్ ని నిర్వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్(SS Thaman) ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా ఆశించకుండా, ఈ మ్యూజిక్ నైట్ ని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ పేరుతో నిర్వహించాడు. ఈ ఈవెంట్ కి సీఎం చంద్రబాబు నాయుడు మరియు ఆయన కుటుంబ సభ్యులతో పాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. అయితే ఈ ;ప్రోగ్రాం మొత్తంలో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఒక రేంజ్ లో డామినేట్ చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తమన్ మ్యూజిక్ ఈవెంట్ ని ప్రారంభించేముందు స్టేడియం మొత్తం ‘ఓజీ..ఓజీ’ నినాదాలతో హోరెత్తిపోయింది.
ఆ ప్రకంపనలు చూసి పవన్ కళ్యాణ్ మౌనం గా అలా చూస్తూ ఉండిపోగా, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్(Nara Lokesh) మాత్రం షాక్ కి గురయ్యారు. ఆ రేంజ్ లో దద్దరిల్లిపోయేలా చేసారు. తమన్ కూడా ఆ క్రేజ్ ని చూసి నవ్వుకొని, ఓజీ గురించి పాట రూపం లో మాట్లాడుకుందామని ఆయన ఓజీ గ్లిమ్స్ ఆడియో ట్రాక్ ని పాడుతాడు. దీనికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ గా మారింది. ఇతర హీరోల అభిమానులు సైతం ఆ వీడియో ని చూసి ఇదేమి క్రేజ్ రా బాబు అని పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి దండం పెడుతున్నారు. మరోవైపు కొంతమంది అభిమానులు తొందరగా ఈ సినిమాని పూర్తి చేసి విడుదల చెయ్యి అన్న, హైప్ మీటర్ ఇప్పటికే బ్లాస్ట్ అయిపోయింది అంటూ చెప్పుకొస్తున్నారు.
The ‘OG’ chants at #NTRTrust Euphoria Musical Night.#TheyCallHimOG #PawanKalyan pic.twitter.com/6jBHqBxdhC
— Gulte (@GulteOfficial) February 15, 2025