Globetrotter Event Cancellation: కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘#Globetrotter’ ఈవెంట్ ఎల్లుండి రామోజీ ఫిల్మ్ సిటీ లో ఘనంగా జరగనుంది. ఈ ఈవెంట్ కోసం మహేష్(Superstar Mahesh Babu) ఫ్యాన్స్, టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. ఎందుకంటే #RRR లాంటి ఆస్కార్ అవార్డు విన్నింగ్ సినిమా తర్వాత రాజమౌళి(SS Rajamouli) చేస్తున్న చిత్రం కాబట్టి. అందుకే ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ యూజర్లు ఉన్నటువంటి జియో హాట్ స్టార్ లో ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ కాబోతుంది. కొన్ని లక్షల మంది ఈ ఈవెంట్ ని లైవ్ లో చూడబోతున్నారు. అందుకే ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేస్తుంది మూవీ టీం. అందుకోసం రాజమౌళి ప్రత్యేకమైన వర్క్ షాప్ ని కూడా ఏర్పాటు చేసాడు. యాంకర్ సుమ తో కూర్చొని ప్లానింగ్ గురించి మాట్లాడున్న ఫోటోలను మనం సోషల్ మీడియా లో చాలానే చూసి ఉంటాము.
ఇంత ప్లానింగ్ చేసుకున్న ఈ ఈవెంట్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈమధ్య కాలం లో వరుసగా బాంబ్ బ్లాస్ట్ బెదిరింపులు రావడం, ఇండియా గేట్ వద్ద జరిగిన బాంబు దాడి దృష్ట్యా దేశవ్యాప్తంగా భారీ సభలకు ప్రభుత్వాలు అంత తేలికగా అనుమతిని ఇవ్వలేదు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఈవెంట్ జరుపుకునేందుకు అనుమతి ని ఇచ్చింది. లక్ష మంది అభిమానులు వస్తారని, వాళ్ళతో ఈవెంట్ చేస్తామని , అందుకు తగ్గ పోలీస్ భద్రతా కావాలి అంటూ మూవీ టీం రిక్వెస్ట్ పెట్టుకుంది. కానీ ప్రభుత్వం కేవలం 50 వేలమందికి మాత్రమే అనుమతి ని ఇచ్చింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఆ 50 వేలమందితో అయినా ఈవెంట్ అవసరమా?, జరగరానిది ఏదైనా జరిగితే మూవీ టీం రెస్పాన్స్ తీసుకుంటుందా అనే వాదన కూడా వినిపిస్తోంది.
మధ్యలో హై కోర్టు చొరవ తీసుకొని, అసలు జన సమీకరణ ఈవెంట్స్ కొన్ని రోజులు జరగరాదని ఉత్తర్వులు జారీ చేస్తే పరిస్థితి ఏంటి?, ఈవెంట్ ని ఆపేయాల్సిందేనా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ అలాంటి భయాలు పెట్టుకొనవసరం లేదని, మూవీ టీం కేవలం పాసులు ఉన్న ఆడియన్స్ ని లోపలకు రానిస్తారట. ఈ విషయం లో చాలా కఠినమైన రూల్స్ ని ఏర్పాటు చేశారట. మరి ఈ రూల్స్ ని ఎంత మేరకు అనుసరిస్తారో చూడాలి.