Rajinikanth And Kamal Haasan: రజినీకాంత్(Superstar Rajinikanth), కమల్ హాసన్(Kamal Hassan) కాంబినేషన్ లో చాలా కాలం తర్వాత ఒక ప్రాజెక్ట్ రాబోతుందని విషయం సౌత్ ఇండియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తున్న విషయం వాస్తవమే, కానీ అది మల్టీస్టార్రర్ చిత్రం మాత్రం కాదు అట. కమల్ హాసన్ నిర్మాతగా, తన సొంత బ్యానర్ అయినటువంటి ‘రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్’ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నాడు. ముందుగా ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తాడనే టాక్ ఇండస్ట్రీ మొత్తం పాకింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఆ తర్వాత తెలిసింది. ఆ తర్వాత రజినీకాంత్ తో జైలర్, జైలర్ 2 చిత్రాలు చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని అంతా అనుకున్నారు, కానీ అది కూడా ఫేక్ న్యూస్ అని తెలిసింది.
అయితే రీసెంట్ గానే ఈ చిత్రానికి సుందర్ C దర్శకత్వం వహించబోతున్నాడని అధికారిక ప్రకటన ఒక వీడియో ద్వారా తెలిపారు. కానీ ఇప్పుడు ఆయన ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్టు ఒక అధికారిక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేసాడు. అందులో ఏముందంటే ‘కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ రజినీకాంత్, కమల్ హాసన్ లతో నాకు ఉన్న అనుబంధానికి ఎలాంటి డిస్టర్బెన్స్ రాలేదు. కానీ వాళ్ళిద్దరితో కలిసి చేసిన ఈ ప్రయాణాన్ని జీవితం లో మర్చిపోలేను’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ కి గురయ్యారు. అదేంటి ఈ సినిమా స్టోరీ ని డైరెక్ట్ చేయడానికి ఏ డైరెక్టర్ కూడా సాహసం చేయడం లేదు, కథలో ఏమైనా లోపం ఉందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అసలు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎంతవరకు ఈ సినిమా ముందుకు వెళ్తుంది అనేది. ఇకపోతే ఈ ఏడాది రజినీకాంత్ కూలీ చిత్రం తో మన ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిల్చింది. ఇప్పుడు రజిని అభిమానులు మొత్తం ‘జైలర్ 2’ కోసమే ఎదురు చూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది మొదటి హాఫ్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.