Shiva Re Release Collections: సీనియర్ హీరోల్లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) మార్కెట్ పూర్తిగా చెడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఆయన మార్కెట్ ఇప్పటికీ ఎంతో కొంత మిగిలి ఉంది కానీ, ఓవర్సీస్ లో మాత్రం పూర్తిగా సున్నా అయిపోయింది. అలాంటి నాగార్జున రీ రిలీజ్ చిత్రం ఓవర్సీస్ లో రీసెంట్ గా విడుదలైన ఆయన కొత్త సినిమాలకు కూడా ఈ రేంజ్ క్రేజ్ లేకపోవడం గమనార్హం. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు ‘శివ'(Shiva Re Release). రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఓవర్సీస్ లో అయితే ఇప్పటికే ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఆ షోస్ నుండి దాదాపుగా ఈ చిత్రానికి 20 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. రీసెంట్ గా విడుదలైన ఏ సీనియర్ హీరో రీ రిలీజ్ సినిమాకు కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రాలేదు.
అంతెందుకు స్టార్ హీరోలుగా పిలవబడే ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ రీ రిలీజ్ సినిమాలకు కూడా ఇంత గ్రాస్ వసూళ్లు రాలేదు. ప్రభాస్ రీ రిలీజ్ చిత్రాల్లో బాహుబలి ని మినహాయిస్తే, సలార్, యోగి, బిల్లా రీ రిలీజ్ చిత్రాలకు కూడా ఇంత గ్రాస్ వసూళ్లు రాలేదు. ఇప్పటికీ ఈ సినిమా రన్ ఆగలేదు. ఫుల్ రన్ లో మరో 30 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఓవర్సీస్ గ్రాస్ మొత్తం కలిపి 70 లక్షల వసూళ్లు రావొచ్చు అట. ఇక తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక మరియు చెన్నై ప్రాంతాలకు కలిపి మొదటి రోజు మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే సీనియర్ హీరోల రీ రిలీజ్ చిత్రాల్లో కచ్చితంగా శివ చిత్రం టాప్ 5 లో నిలిచే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి అంచనాలను ఈ సినిమా ఏ రేంజ్ లో అందుకోబోతుంది అనేది. ఎట్టకేలకు అక్కినేని ఫ్యాన్స్ కి ఈ ఏడాది బాగా కలిసొచ్చింది అనే చెప్పాలి. నాగార్జున నుండి విడుదలైన కుబేర, కూలీ చిత్రాలు, నాగచైతన్య నుండి విడుదలైన తండేల్, అదే విధంగా ఇప్పుడు శివ రీ రిలీజ్ కూడా సక్సెస్ అవ్వడం తో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీదున్నారు.