విక్టరీ వెంకటేశ్ కథా బలమున్న విలక్షణ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. అందుకే ‘విక్టరీ’ అనే బిరుదు ఆయన సొంతమైంది. విజయాలకు మారు పేరుగా ఉండేవారు. ఆ కోవలోనే ఇప్పుడు మరో సినిమాతో మనముందుకు వస్తున్నారు.
వెంకటేశ్ 74వ సినిమాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘నారప్ప’ మూవీ నుంచి తొలి పాట రిలీజ్ చేశారు. మణిశర్మ అందించిన అందమైన బాణీ ప్రతిఒక్కరి హృదయాన్ని తాకేలా డిజైన్ చేశారు.
తమిళంలో ‘అసురన్’గా రిలీజ్ హిట్ కొట్టిన మూవీని తెలుగులో వెంకటేశ్ హీరోగా రిమేక్ చేశారు.ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను సమర్పిస్తున్నాయి. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం కడుతున్నారు.
ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకొని యూ/ఏ రేటింగ్ ను ఈ సినిమా పొందింది. నేడు జులై 11 మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా తొలి పాటను విడుదల చేశారు.
‘చలాకీ చిన్నమ్మ’ అంటూ సాగిపోతున్న ఈ పాటలో వెంకటేశ్, ప్రియమణి కుటుంబం ఎడ్లబండిలో సాగుతుంటే పల్లె అందాలు కనువిందు చేస్తాయి. సైకిల్ పై యువ నటుడు వారి వెనుకాలే వస్తుంటాడు. ఈ మెలోడీ సాంగ్ అందరినీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.