
సినీ, రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేష్ అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం మండలం ఎల్లమందలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈరోజు సాయంత్రం కత్తి మహేష్ పార్థివదేహాన్ని చెన్నై నుంచి ఎల్లమందకు చేరుకోనుంది. జూన్ 27న ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేష్ ను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్న ఆయన శనివారం పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.