కరోనా రెండో వేవ్ పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

గతేడాది కరోనా ప్రపంచాన్ని ఎలా ఆటాడుకుందో అందరికీ తెలిసిందే. నిద్రలో కూడా కరోనా పేరు వింటే భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయి. మన దేశంలోనూ లక్షలాది మంది ప్రాణనష్టాన్ని చూశాం. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నం అయింది. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. మరెంతో మంది రోడ్డున పడ్డారు. వలస కూలీలు పొట్టచేతపట్టుకొని సొంతూళ్లకు వెళ్లిపోయారు. నాటి చేదు జ్ఞాపకాల నుంచి ఇప్పుడిప్పుడే దేశాలు కోలుకుంటున్నాయి. వ్యాక్సిన్‌ వచ్చి కొంత ఊరట కల్పించినా.. మరోసారి కరోనా వైరస్‌ పేరు […]

Written By: NARESH, Updated On : March 18, 2021 1:54 pm
Follow us on

గతేడాది కరోనా ప్రపంచాన్ని ఎలా ఆటాడుకుందో అందరికీ తెలిసిందే. నిద్రలో కూడా కరోనా పేరు వింటే భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయి. మన దేశంలోనూ లక్షలాది మంది ప్రాణనష్టాన్ని చూశాం. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నం అయింది. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. మరెంతో మంది రోడ్డున పడ్డారు. వలస కూలీలు పొట్టచేతపట్టుకొని సొంతూళ్లకు వెళ్లిపోయారు. నాటి చేదు జ్ఞాపకాల నుంచి ఇప్పుడిప్పుడే దేశాలు కోలుకుంటున్నాయి. వ్యాక్సిన్‌ వచ్చి కొంత ఊరట కల్పించినా.. మరోసారి కరోనా వైరస్‌ పేరు తెర మీదకు వచ్చింది. అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైంది. దీంతో మరోసారి ప్రజల్లో భయం మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ నిన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌ మీట్‌ అయ్యారు.

Also Read: కమ్మని సాంబారులా పళని పాలన

ఈ సమావేశానికి బెంగాల్ సీఎం మమత బెనర్జీ, చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భాగేల్ గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ… అందరూ అత్యంత క్రియాశీలకంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో అవసరమున్న చోట్ల ‘మైక్రో కంటెయిన్మెంట్’ జోన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ భయబ్రాంతులకు గురిచేయవద్దని, అలాంటి వాతావరణాన్ని సృష్టించవద్దని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు, మరికొన్ని చర్యలు తీసుకుందామని, ప్రజల్లో మాత్రం భయం తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.

Also Read: కమల్ నామినేషన్.. ఆస్తులు, అప్పులు ఎన్నో తెలుసా!

పలు రాష్ట్రాల్లో కరోనా టెస్టులు తగ్గించారని.. ఆయా రాష్ట్రాల్లో ఎందుకు రిలాక్స్‌ అవుతున్నారో అర్థం కావడం లేదని.. ప్రజలకు సరైన పాలన అందించడానికి ఇదే సరైన సమయమని సూచించారు. పాలనలో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి కానీ.. అతి ఆత్మవిశ్వాసం వద్దని కోరారు. దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని, త్వరితగతిన అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎంలకు సూచించారు. ఇప్పటివరకూ సురక్షితంగా ఉన్న జిల్లాల్లోనే తిరిగి కరోనా పెరుగుదల కనిపిస్తోందని, 70 జిల్లాల్లో కరోనా తీవ్రత గతంలో కంటే అధికంగా కనిపిస్తోందని మోడీ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

దీనిని అరికట్టకపోతే మరోసారి కరోనా విలయ తాండవం చేసే అవకాశం ఉందని, అలా జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని స్పష్టం చేశారు. కరోనాతో ప్రభావితమైన చాలా దేశాలు రెండో వేవ్‌ను చవిచూస్తున్నాయని, మన దేశం కూడా ఆ జాబితాలోకే వస్తుందని మోదీ పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అమాంతం పెరిగిపోయాయని, ఈ విషయంపై ముఖ్యమంత్రులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. కరోనా నుంచి చాలా మంది కోలుకుంటున్నారని, మరణాల రేటు తక్కువగా ఉన్న జాబితాలోకి ఇండియా చేరిందని ఆయన పేర్కొన్నారు. అయితే.. రాష్ట్రాల్లో మాత్రం టెస్టుల సంఖ్య పెంచాలని అవసరం ఎంతైనా ఉందని సూచించారు.