Celebrity praises on Bheemla Nayak Movie: “భీమ్లా నాయక్” పై సినీ ప్రముఖుల ప్రసంసల వర్షం

Celebrity praises on Bheemla Nayak Movie: పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ఏంటో బాక్సాఫీస్ వద్ద “భీమ్లా నాయక్” ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. పవన్ కళ్యాణ్ కొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో తానూ బాక్సాఫీస్ కింగ్ ను అని పవన్ నిరూపించారు. మొత్తమ్మీద సక్సెస్‌ఫుల్ టాక్‌తో పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లానాయక్’ మూవీ దూసుకెళ్తోంది. పవన్ ఫ్యాన్స్ […]

Written By: Raghava Rao Gara, Updated On : February 26, 2022 11:37 am

Bheemla Nayak First Day US Collections!

Follow us on

Celebrity praises on Bheemla Nayak Movie: పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ఏంటో బాక్సాఫీస్ వద్ద “భీమ్లా నాయక్” ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. పవన్ కళ్యాణ్ కొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో తానూ బాక్సాఫీస్ కింగ్ ను అని పవన్ నిరూపించారు.

Pawan Kalyan and Rana Daggubati in Bheemla Nayak

మొత్తమ్మీద సక్సెస్‌ఫుల్ టాక్‌తో పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లానాయక్’ మూవీ దూసుకెళ్తోంది. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాను ఫుల్ ఎంజాయ్ చేస్తుండగా.. మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ సక్సెస్ కావడంపై స్పందించారు. ‘భీమ్లానాయక్ చిత్ర బృందానికి అభినందనలు. నిజమైన పవర్ తుపాను’ అని రానా, పవన్ కళ్యాణ్‌లతో కలిసి దిగిన ఫోటోను చిరు పోస్ట్ చేశారు.

Also Read:  మెంటల్ నా కొడుక్కి మైండ్ దొబ్బింది.. పవన్ ఫ్యాన్స్ సీరియస్

 

అన్నట్టు పవన్ సినిమా పై భీమ్లానాయక్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందని మంచు మనోజ్ అన్నాడు. పవన్ కళ్యాణ్, రానా కలిసి ఉన్న పోస్టర్‌ని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘ఒకే ఫ్రేమ్‌లో నాకిష్టమైన ఇద్దరు వ్యక్తులు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అని మనోజ్ పేర్కొన్నాడు. త్రివిక్రమ్ రైటింగ్ వర్క్, సాగర్ చంద్ర డైరెక్షన్, తమన్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లాయన్నాడు.

ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున సినిమా పై తమ ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు. హీరో నాని కూడా తన ఫ్యామిలీతో “భీమ్లా నాయక్” సినిమాను వీక్షించారు. అనంతరం తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేస్తూ.. ‘హార్ట్ టచింగ్ ఫెర్మామెన్స్… పవర్ స్టార్ అద్భుతం’ అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: భీమ్లానాయక్ దెబ్బకు ఏకంగా సెలవు ప్రకటించిన ఆ దిగ్గజ కంపెనీ

 

Tags