https://oktelugu.com/

అతి చిన్న వయసులోనే మృతి చెందిన సెలబ్రిటీలు వీళ్ళే..!

సాధారణంగా మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కేవలం మనతల రాత ఎలా వుంటే అలా మన జీవితంలో ముందుకు వెళ్తున్నాము. అయితే అప్పటి వరకు అందరితో కలిసి ఎంతో సరదాగా మాట్లాడిన కొందరు అకాల మరణం చెందుతుంటారు. ఇలా మృతిచెందిన వారి గురించి తెలుసుకొని అందరూ ఎంతో షాక్ అవుతుంటారు. అయితే సినిమా సెలబ్రిటీలు ఇలా ఆకస్మికంగా మరణిస్తే వారి మరణవార్త తెలుసుకున్న ఎంతోమంది తమ సొంత కుటుంబ సభ్యులు మరణించినట్టు ఫీలవుతుంటారు.ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 3, 2021 / 05:38 PM IST
    Follow us on

    సాధారణంగా మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కేవలం మనతల రాత ఎలా వుంటే అలా మన జీవితంలో ముందుకు వెళ్తున్నాము. అయితే అప్పటి వరకు అందరితో కలిసి ఎంతో సరదాగా మాట్లాడిన కొందరు అకాల మరణం చెందుతుంటారు. ఇలా మృతిచెందిన వారి గురించి తెలుసుకొని అందరూ ఎంతో షాక్ అవుతుంటారు. అయితే సినిమా సెలబ్రిటీలు ఇలా ఆకస్మికంగా మరణిస్తే వారి మరణవార్త తెలుసుకున్న ఎంతోమంది తమ సొంత కుటుంబ సభ్యులు మరణించినట్టు ఫీలవుతుంటారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా గుర్తింపు సంపాదించుకున్న ఎంతోమంది నటీనటులు కొన్ని కారణాల వల్ల చిన్న వయసులోనే మృతిచెందారు. మరి ఇలా మృతిచెందిన ఆ సెలబ్రిటీలు ఎవరు అనే విషయానికి వస్తే…

    సావిత్రి: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమె సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని చెడు అలవాట్లు కారణంగా సావిత్రి 45 సంవత్సరాలకే మృతి చెందారు. ఈమె తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చనిపోయారు.

    సౌందర్య: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సావిత్రి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సౌందర్య.ఏమి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ కన్నడ హిందీ భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.అయితే ఈమె ఒక రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయడానికి హెలికాప్టర్ లో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగే మృతి చెందారు.

    ఉదయ్ కిరణ్: ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన ఉదయ్ కిరణ్ అప్పట్లో స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అయితే కొద్ది కారణాల వల్ల వివాహం తర్వాత ఉదయ్ కిరణ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని చనిపోయారు.

    కునాల్: ప్రేమికుల రోజు సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కునాల్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈయన ఆత్మహత్య చేసుకున్నారు.

    సుశాంత్ సింగ్ రాజ్ పుత్: బాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో సుశాంత్ పలు సినిమాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. కొంతకాలం నుంచి తీవ్రమైన డిప్రెషన్ తో బాధపడుతున్న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారు.

    పునీత్ రాజ్ కుమార్: కన్నడ చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న పునీత్ జిమ్ చేస్తూ ఉన్న ఫలంగా గుండెపోటుకు గురయ్యారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో నలభై ఆరు సంవత్సరాలకు మృతి చెందారు.కేవలం వీరు మాత్రమే కాకుండా ఎంతో మంది సెలబ్రిటీలు అతి చిన్న వయసులోనే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు.