Homeఎంటర్టైన్మెంట్Celebrities supporting Jagan facing issues: జగన్ ని ఇష్టపడే సెలబ్రిటీలకు టాలీవుడ్ లో అవకాశాలు...

Celebrities supporting Jagan facing issues: జగన్ ని ఇష్టపడే సెలబ్రిటీలకు టాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదా..? ఆసక్తి రేపుతున్న హీరో శివాజీ కామెంట్స్!

Celebrities supporting Jagan facing issues: ఒకప్పుడు సినిమాలను , రాజకీయాలను వేరు వేరుగా చూసేవాళ్ళు కాదు. కానీ గత వైసీపీ హయాంలో రెండిటిని కలిపి చూశారు . సినిమా వేడుకల్లో రాజకీయ కౌంటర్లు కొంతమంది ఆర్టిస్టులు ఇవ్వడం వల్ల , వైసీపీ హయాం పవన్ కళ్యాణ్ సినిమాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకోవాల్సి వచ్చింది . పవన్ కళ్యాణ్ తోటి స్టార్ హీరోలందరి సినిమాలకు టికెట్ రేట్స్ వచ్చేవి , కానీ పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రం వచ్చేవి కాదు. ఆ కారణం చేత ఆయన సినిమాలు చాలా నష్టాలను చవిచూసేవి . అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన వైసీపీ పార్టీ కి మద్దతు ని ఇచ్చే సినీ సెలబ్రిటీలకు అవకాశాలు రావడం లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు . దీనిపై హీరో ఇవ్వాజి రీసెంట్ గా ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పందించాడు.

ఆయన మాట్లాడుతూ ‘కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కి మద్దత్తు ఇస్తున్న సినీ సెలబ్రిటీలకు అవకాశాలు రావడం లేదంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను ఏ రాజకీయ పార్టీ కి చెందిన వాడిని కాదు , కానీ నాకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం . అలాగే వైసీపీ పార్టీ ని , జగన్ ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు . అందులో ఎలాంటి తప్పు లేదు. కేవలం వాళ్లకు సపోర్ట్ చేయడం వల్ల సినిమా అవకాశాలు రావడం లేదు అనేది పిచ్చి వాదన. టాలెంట్ ఉంటే ఏ పార్టీ కి చెందిన వాడైనా పర్వాలేదు , అవకాశాలు నడుచుకుంటూ వస్తాయి. ఉదాహరణకు ప్రకాష్ రాజ్ గారిని తీసుకుందాం . ఆయన పవన్ కళ్యాణ్ తో రాజకీయ పరంగా ఏ రేంజ్ లో విబేధిస్తాడో మనమంతా చూశాము’.

‘కానీ సినిమా అన్న తర్వాత వాళ్లిద్దరూ కలిసి ఓజీ చిత్రం లో నటించారు.. అంతే ఎక్కడైనా సరే , టాలెంట్ ఉన్న నటులు సినిమాకు అవసరం , పార్టీలను చూసి నటీనటులను ఎంచుకునే సంస్కృతి మన దగ్గర లేదు , భవిష్యత్తులో రాబోదు కూడా ‘ అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ. ఆయన హీరో గా నటించిన ‘సాంప్రదాయినీ..సుప్పిని.. సుద్దపూసని’ చిత్రం వచ్చే నెల 6 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ శివాజీ సరసన నటించింది. ఈ చిత్రం లో శివాజీ హీరో గా నటించడమే కాకుండా , నిర్మాతగా కూడా వ్యవహరించాడు . ముందుగా ఈ సినిమాని నేరుగా ఈటీవీ విన్ యాప్ లో విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ ఈ కంటెంట్ థియేటర్స్ లో కూడా క్లిక్ అవుతుంది అనే బలమైన నమ్మకం తో మార్చి 6 న థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు , రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular