
సెలబ్రిటీలందు.. సినిమా సెలబ్రిటీలు వేరయా అని ఖచ్చితంగా అనొచ్చు. అద్దాల మేడల్లో రంగుల బొమ్మలుగా అలరించే సినీ తారలకు సంబంధించిన ప్రతీ విషయం కూడా జనానికి ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అందుకే.. తెలియని ఏ చిన్న విషయమైనా ఎంతో క్యూరియాసిటీతో తెలుసుకునే ప్రయత్నం చేశారు.
అయితే.. సినిమాల గురించే అభిమానులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. ఇక, వారి పర్సన్ లైఫ్ గురించి ఇంకెలా ఉంటుందీ? వారికుటుంబం, వ్యక్తిగత జీవితం అన్నింటి గురించీ తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. అయితే.. వారి ఫోన్ గురించి, అందులోని విశేషాల గురించితై మరింత ఆసక్తిని ప్రదర్శిస్తారు. మరి, వాటి గురించి తెలుసుకుందామా?
బాలీవుడ్ బ్యూటీ, తెలుగు తెర ‘సీత’ అలియా భట్ ఫోన్ వాల్ పేపర్ గా ప్రియుడు రణ్ బీర్ కపూర్ ను హత్తుకున్న ఫొటో ఉంటుంది. ఈ ఫొటో చూసిన వారు.. వీళ్లిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో అని అనుకుంటున్నారు.
ఇక, ఆర్ ఎక్స్100 తో యూత్ స్టార్ గా మారిపోయిన హీరో కార్తికేయ వాల్ పేపర్ గా మెగాస్టార్ చిరంజీవితో దిగిన ఫొటో ఉంది. ఏదో సందర్భంలో దిగిన ఫొటోనే తన వాల్ పేపర్ గా పెట్టుకున్నాడు కార్తికేయ.
మెగా కోడలు ఉపాసన మేకప్ రూమ్ లో సితారతో దిగిన క్యూట్ ఫొటో ఉంది. తమన్నా మేకప్ రూమ్ లో అభిమానులు ఇచ్చిన ఫొటో ఫ్రేమ్ ను గోడకు వేళాడదీసి ఉంది.
ఇక, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంటాక్ట్ లిస్టులో చిరంజీవి పేరు ఏమని పెట్టుకున్నాడో తెలుసా? Chiranjeevi Pvt అని మెగాస్టార్ పేరు సేవ్ చేసుకున్నాడు నాగ్.
సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం తన డీపీలో సింహాన్ని పెట్టుకోవడం గమనార్హం. వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్లో భాగంగా నాగార్జున ఈ స్క్రీన్ షాట్ ను షేర్ చేయడంతో.. ప్రిన్స్ డీపీ ఏంటో అందరికీ తెలిసిపోయింది.