ఎన్టీఆర్ తో ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ త్రివిక్రమ్ చేస్తోన్న పాన్ ఇండియా మూవీ ఆగిపోయిందని.. త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ కి మధ్య కథ విషయంలో తేడా కొట్టిందని.. దాంతో త్రివిక్రమ్ తో తన కొత్త సినిమాని ఎన్టీఆర్ పక్కన పెట్టాడని ఇలా అనేక రకాలుగా సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అలాగే త్రివిక్రమ్ మహేష్ కి ఇచ్చిన మాట ప్రకారం, ఎన్టీఆర్ సినిమాని పోస్ట్ ఫోన్ చేసుకున్నాడని గత రెండు రోజులు నుండి ఒక రూమర్ వినిపిస్తోంది.
మొత్తానికి ఎన్టీఆర్ 30వ సినిమా పై వస్తోన్న రూమర్స్ కి చెక్ పెట్టేందుకు ఎన్టీఆర్ పర్సనల్ మేనేజర్ మహేష్ కోనేరు రంగంలోకి దిగారు. తాజాగా ట్వీట్ చేస్తూ.. రేపు సాయంత్రం ఎన్టీఆర్ 30వ సినిమా గురించి అఫీషియల్ అప్ డేట్ ఉంటుందని.. అన్ని ప్రశ్నలకు సమాధానం రేపు లభించొచ్చు’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ఆగిపోలేదు అని తెలుస్తోంది. ఎన్టీఆర్ తన తర్వాత సినిమాని ఎట్టి పరిస్థితుల్లో త్రివిక్రమ్ తోనే చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడని ఎన్టీఆర్ సన్నిహితుల దగ్గర నుండి వస్తోన్న సమాచారం.
ఇక ఈ సినిమా కథ గురించి కూడా ఒక అప్ డేట్ ఏమిటంటే.. ఒక కొత్త తరహా కథతోనే ఎన్టీఆర్ తో సినిమా చేయాలని దర్శకుడు త్రివిక్రమ్ బలంగా నిర్ణయించుకున్నాడట. రెగ్యులర్ మూస కథలకు తనదైన శైలి స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రాసి, ఆ కథలను జనం చేత ఒప్పిస్తూ ఎలాగోలా తన సినిమాలను సూపర్ హిట్ చేసుకునే అలవాటు ఉన్న త్రివిక్రమ్.. ఈ సారి మాత్రం భారీ కథతో బలమైన ఎమోషన్ తోనే సినిమా చేయాలని మెంటల్ గా ఫిక్స్ అయ్యాడట. అందుకే కథ విషయంలో ఎన్టీఆర్ కాంప్రమైజ్ అయినా త్రివిక్రమ్ అసలు అవ్వట్లేదట.
#NTR30 official update tomorrow evening. Anni prasnalaku samadhanam repu labhinchunu 🤘
— Mahesh Koneru (@smkoneru) April 11, 2021
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Ntr 30th movie updates released tomorrow evening
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com