ఎక్స్ క్లూజివ్ : రానా ఇంట్లో వేడుక.. సినీ పెద్దలకు ఆహ్వానం !

విభిన్న నటుడు రానా, తన భార్య మిహీకతో కలిసి మరిచిపోలేని ఓ వేడుకను ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ దేనికి వేడుక అనేగా ? కారణం మొదటి వెడ్డింగ్ యానివర్సరీ. అసలుకే పెళ్లి కూడా కరోనా కారణంగా చాల సింపుల్ గా చేసుకున్నారు. మరి కనీసం మొదట్టి పెళ్లి రోజు వేడుకనైనా ఘనంగా సెలబ్రేట్ చేయకపోతే ఎలా ? అందుకే సురేష్ బాబు కూడా ఈ వేడుకకు ఇండస్ట్రీ పెద్దలు అందర్నీ పిలుస్తున్నారు. రానా – మిహిక గతేడాది […]

Written By: admin, Updated On : July 20, 2021 4:17 pm
Follow us on

విభిన్న నటుడు రానా, తన భార్య మిహీకతో కలిసి మరిచిపోలేని ఓ వేడుకను ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ దేనికి వేడుక అనేగా ? కారణం మొదటి వెడ్డింగ్ యానివర్సరీ. అసలుకే పెళ్లి కూడా కరోనా కారణంగా చాల సింపుల్ గా చేసుకున్నారు. మరి కనీసం మొదట్టి పెళ్లి రోజు వేడుకనైనా ఘనంగా సెలబ్రేట్ చేయకపోతే ఎలా ? అందుకే సురేష్ బాబు కూడా ఈ వేడుకకు ఇండస్ట్రీ పెద్దలు అందర్నీ పిలుస్తున్నారు.

రానా – మిహిక గతేడాది ఆగస్టులో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన దగ్గర నుండి రానా – మిహీక చాలా అన్యోన్యంగా ఉంటున్నారని.. ముఖ్యంగా రానాలో కొత్త మార్పులు చాల వచ్చాయని కుటుంబ సభ్యులు కూడా ఫీల్ అవుతున్నారు. ఇదే విషయం గురించి రానా చెప్పుకొస్తూ.. ‘పెళ్లి అయిన తర్వాత ముఖ్యంగా ఈ ఏడాదిలో నా జీవనశైలిలో చాల మంచి మార్పులు వచ్చాయి.

నేను ఒకప్పుడు టైంకి తినేవాడిని కాదు, అలాగే మిడ్ నైట్ పార్టీలు కారణంగా నాకు సరైన నిద్ర కూడా ఉండేది కాదు. అయితే, పెళ్లి తర్వాత నుండి నా సతీమణి నా అలవాట్లును పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు నేను టైంకి తింటున్నాను. అలాగే ఎక్కువ సేపు పడుకుంటున్నాను. మొత్తానికి నా జీవితంలో ఇప్పుడు అన్నీ టైంకి జరుగుతున్నాయి.

జీవితంలో ఒక స్థిరత్వం వచ్చిన భావన కలుగుతుంది’ అంటూ రానా చెప్పుకొచ్చాడు. రానా ఈ సంగతులు అన్నీ డెక్కన్ క్రానికల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రానా ప్రస్తుతం ‘విరాటపర్వం’ అనే ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివర దశలో ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసి ‘అయ్యపనం కోషియం’ రీమేక్ లో కూడా రానా నటిస్తున్నాడు.