
టీమ్ ఇండియాకు చాహల్ బ్రేకిచ్చాడు. ఓకే ఓవర్లు రెండు వికెట్లు తీశాడు. చాహల్ వేసిన 14వ ఓవర్ లో మినోద్ భానుక (36), రాజపక్స (0) వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. దాంతో శ్రీలంక 77 పరుగుల వద్ద తొలి రెండు వికెట్లు కోల్పోయింది. భానుక ఆడిన షాట్ ను మనీష్ పాండే క్యాచ్ అందుకోగా తర్వాత రాజపక్స వికెట్ల వెనుక కీపర్ కు చిక్కాడు. క్రీజులో అవిష్క ఫెర్నాండో (30), ధనంజయ (1) ఉన్నారు. 14 ఓవర్లకు శ్రీలంక 78/2 గా ఉంది.