https://oktelugu.com/

శ్రావణి ఆత్మహత్యకు ముందు.. దొరికిన సీసీటీవీ ఫుటేజ్?

గత మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన మౌనరాగం సీరియల్‌ నటి శ్రావణి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. టిక్‌టాక్‌ ఫ్రెండ్‌ సాయికృష్ణ పేరు ముందుగా వినిపించింది. తర్వాత దేవరాజు రెడ్డి పేరు వెలుగులోకి రాగా.. నిన్నటితో RX-100 సినిమా నిర్మాత అశోక్‌ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. శ్రావణి ఈ ముగ్గురు మధ్య చిక్కుకొని చివరకు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. Also Read: బిగ్ బాస్ కి కూడా షాక్ ఇచ్చిన దివి ! దేవరాజ్‌, […]

Written By:
  • NARESH
  • , Updated On : September 11, 2020 / 10:42 AM IST

    tv actor sravani

    Follow us on


    గత మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన మౌనరాగం సీరియల్‌ నటి శ్రావణి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. టిక్‌టాక్‌ ఫ్రెండ్‌ సాయికృష్ణ పేరు ముందుగా వినిపించింది. తర్వాత దేవరాజు రెడ్డి పేరు వెలుగులోకి రాగా.. నిన్నటితో RX-100 సినిమా నిర్మాత అశోక్‌ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. శ్రావణి ఈ ముగ్గురు మధ్య చిక్కుకొని చివరకు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది.

    Also Read: బిగ్ బాస్ కి కూడా షాక్ ఇచ్చిన దివి !

    దేవరాజ్‌, శ్రావణి కలిసి ఓ హోటల్లలో భోజనం చేసిన సీసీ టీవీ ఫుటేజీని తాజాగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవరాజ్‌తో శ్రావణి సన్నిహితంగా ఉన్నట్లు పోలీసులు అందులో గుర్తించారు. తాము భోజనం చేస్తున్న సమయంలోనే సాయికృష్ణ వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించాడని.. శ్రావణిని రోడ్డు మీద జుట్టు పట్టుకొని కొట్టాడని ఇప్పటికే దేవరాజ్‌ చెప్పాడు.

    దీనిపై సాయిని పోలీసులు శుక్రవారం విచారించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సాయిని విచారిస్తే కానీ అసలు విషయాలు వెలుగులోకి వచ్చేలా లేవని పోలీసులు భావిస్తున్నారు. సాయితోపాటే RX 100 సినీ నిర్మాత అశోక్‌ రెడ్డిని కూడా విచారించనున్నట్లు సమాచారం.

    Also Read: ఏంటిది.. అభిమానులందరికీ షాకిచ్చిన చిరంజీవి

    అయితే.. గురువారం దేవరాజ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా శ్రావణి తన కుటుంబసభ్యులు, సాయి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని అంటున్నాడు. మరోవైపు చూస్తే పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీ టీవీ ఫుటేజీల్లో వీరిద్దరి సాన్నిహిత్యం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం మరో ఇద్దరిని విచారిస్తే కానీ ఈ కేసు ఓ కొలిక్కి వచ్చేలా లేదని పోలీసులు అంటున్నారు.