Also Read: బిగ్ బాస్ కి కూడా షాక్ ఇచ్చిన దివి !
దర్శకుడు త్రివిక్రమ్ ఇటీవల ‘అలవైకుంఠపురములో’ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ మూవీ రాబోతుంది. ‘అయినను హస్తినపురికి పోయిరావలె’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం కిందటి సంక్రాంతికి ‘సరిలేరునికెవ్వరు’ మూవీతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లితో సినిమా తీయబోతున్నట్లు వార్తలు విన్పించాయి.
అయితే వంశీ పైడిపల్లి కథను సిద్ధం చేయడంలో ఆలస్యం చేయడంతో మహేష్ బాబు మరొక దర్శకుడితో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇక్కడే గాసిప్ రాయుళ్లు కథ అల్లేశారు.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఆలస్యం అవుతుండటంతో మహేష్ భార్య నమ్రత దర్శకుడు త్రివిక్రమ్ కు ఫోన్ చేసి సినిమా చేయాలని కోరిందట. అయితే తివిక్రమ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం ఆర్జెంటుగా దర్శకుడు పర్శురాంతో సినిమా చేసేందుకు మహేష్ రెడీ అయ్యాడట. అలా వచ్చిందే ‘సర్కారీవారిపాట’.
ఇదిలా ఉండగా మహేష్-తివిక్రమ్ తో తాజాగా మూవీ చేస్తున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ఎన్టీఆర్ సినిమాను పక్కన త్రివిక్రమ్ మహేష్ తో సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మహేష్ ప్రస్తుతం ‘సర్కారీవారిపాట’ మూవీ చేయనున్నాడు. నవంబర్లో ఏకబిగిన 40రోజులపాటు అమెరికాలో షూటింగ్ చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.
Also Read: శ్రావణి ఆత్మహత్యకు ముందు.. దొరికిన సీసీటీవీ ఫుటేజ్?
దీంతో మహేష్ కోసం దర్శకుడు త్రివిక్రమ్ వచ్చే ఏడాది ప్రారంభం వరకు ఆగాల్సి ఉంటుంది. అన్నిరోజులు త్రివిక్రమ్ ఖాళీగా ఉంటాడా? అన్న సందేహమే. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మూవీ ఇప్పట్లో ఉండబోదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అతడు’..‘ఖలేజా’ మూవీలు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ సెట్ కాకపోయినా భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఎక్కువగానే కన్పిస్తున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.