https://oktelugu.com/

బిగ్ బాస్ కి కూడా షాక్ ఇచ్చిన దివి !

బిగ్ బాస్ సీజన్ 4 రోజురోజుకు మొత్తానికి అందర్నీ ఆకట్టుకునే దిశగా సాగుతోంది. ఫస్ట్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్లను చూడగానే ప్రేక్షకులు పెదవి విరిచారు. వీళ్ళల్లో చాలామంది ఎవరో కూడా మాకు తెలియదు అని నెటిజన్లు కూడా కామెంట్స్ చేసి షోని ట్రోల్ చేశారు. అయితే షో ముందుకు వెళ్తోన్న కొద్దీ కంటెస్టెంట్ల మధ్య జరిగే డ్రామా షో మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తోంది. ముఖ్యంగా కంటెస్టెంట్ దివి షో ప్రారంభమైనా నుండి సైలెంట్ గానే ఉంది. […]

Written By:
  • admin
  • , Updated On : September 11, 2020 / 10:41 AM IST
    Follow us on


    బిగ్ బాస్ సీజన్ 4 రోజురోజుకు మొత్తానికి అందర్నీ ఆకట్టుకునే దిశగా సాగుతోంది. ఫస్ట్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్లను చూడగానే ప్రేక్షకులు పెదవి విరిచారు. వీళ్ళల్లో చాలామంది ఎవరో కూడా మాకు తెలియదు అని నెటిజన్లు కూడా కామెంట్స్ చేసి షోని ట్రోల్ చేశారు. అయితే షో ముందుకు వెళ్తోన్న కొద్దీ కంటెస్టెంట్ల మధ్య జరిగే డ్రామా షో మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తోంది. ముఖ్యంగా కంటెస్టెంట్ దివి షో ప్రారంభమైనా నుండి సైలెంట్ గానే ఉంది. ఆమె ఒక్కసారి కూడా షోలో సరిగ్గా మాట్లాడింది లేదు. అసలు ఈమె ఒక్క మాటైనా మాట్లాడకుండానే ఎలిమినేట్ అవుతుందేమో అని నెటిజన్స్ దివి మీద మీమ్స్ కూడా పుట్టించారు. ఇవ్వన్నీ బిగ్‌బాస్‌ కూడా చూసినట్టు ఉన్నాడు. అందుకే బిగ్‌బాస్ దివితో ఒక స్పెషల్ టాస్క్ చేయించాడు. మీరు హౌస్‌మేట్స్‌లో ఏ విషయాన్ని మార్చాలని అనుకుంటున్నారో అందరి ముందు చెప్పాల్సిందిగా దివికి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

    Also Read: ఏంటిది.. అభిమానులందరికీ షాకిచ్చిన చిరంజీవి

    దాంతో దివి ఒక్కసారిగా తనలోని కొత్త యాంగిల్ ని చూపించింది. షోలోని ఒక్కొక్కరిని ఎంచుకుంటూ.. బయట వారిపై ఎలాంటి అభిప్రాయం ఉందనే విషయంతో పాటు వారి పై ఎలాంటి టాక్ నడుస్తోంది.. అలాగే వారి పై తనకు ఎలాంటి అభిప్రాయం ఉందనే విషయాన్ని దివి క్లారిటీగా చెప్పేసింది. అయితే డైరెక్టర్ సూర్యకిరణ్ తో.. మీరు నా మాటే నెగ్గాలని అనే దాన్ని కొంచెం తగ్గించుకోవాలని అతని మోహం మీద చెప్పెడంతో సూర్యకిరణ్‌ లో ఒక్కసారిగా ఆగ్రహం తెప్పించినట్లు అయింది. అలాగే ఎక్కువగా ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు అని, ప్రతీ విషయంలో మీరు అనవసరంగా దూరొద్దని, దూరి తరువాత బాధపడొద్దని కరాటే కళ్యాణికి కూడా తన స్టైల్ లో సెలవిచ్చింది. ఇక లాస్య గురించి అయితే మరీ పరువు తీసినట్లు మాట్లాడింది.

    Also Read: అఖిల్ మూవీకి చరణ్ కు ఉన్న సంబంధమెంటీ?

    లాస్యతో.. మీరు ఊరికే ఫీల్ అవుతారు, మీ గురించే ఏదో మాట్లాడుకుంటామనుకుని అనవసరంగా హర్ట్ అవుతారు అంటూ మొత్తానికి లాస్య గురించి చెప్తూ.. ఆమె ఇగోని హార్ట్ చేసింది. ఇక ఏదైనా నేరుగా పాయింట్ మాట్లాడుతాడని నోయెల్ గురించి కాస్త పాజిటివ్ యాంగిల్ లో చెప్పగా, హీరో అభిజిత్ గురించి.. ఎప్పుడు సైలెంట్‌గా ఉంటాడో.. ఎప్పుడు ఫైర్ అవుతాడో తనకే తెలీదని అభిజీత్ గురించి కూడా కాస్త ఫన్నీ టోన్ లో చెప్పుకొచ్చింది దివి. ఇక పెద్దావిడ గంగవ్వకి కూడా ఈ యంగ్ బ్యూటీ ఓ సలహా ఇచ్చింది. ఎవరైనా ఏడిస్తే నువ్వు కూడా వెంటనే ఏడుస్తావు, నువ్వు అలా ఏడ్వొద్దు.. అంటూ పెద్దావిడకి పెద్ద మాట చెప్పింది. అలాగే ఆరియానా, సోహెల్‌కు బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్ విషయంలోనూ దివి తన అభిప్రాయాన్ని ఎలాంటి మోహమాటలు పెట్టుకోకుండా డైరెక్ట్ గానే చెప్పేసింది. బిగ్‌బాస్ హౌస్‌ స్టార్ట్ అయిన తరువాత దివి మొదటిసారి ఈ రేంజ్ లో మాట్లాడేసరికి.. హౌస్‌మేట్స్‌, ఆడియెన్స్ తో పాటు బిగ్ బాస్ కూడా మొత్తానికి షాక్ అయినట్టు అయింది.