Jeevitha Rajashekar: జీవితరాజశేఖర్ లపై చెక్ బౌన్స్ ఆరోపణలు విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. టాలీవుడ్‌లో కలకలం సృష్టించిన ఈ న్యూస్ వెనుక..అసలు విషయంలో వెళ్తే.. జోస్టర్ ఫిలిం సర్వీసెస్ సభ్యులు.. మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. గరుడ వేగ సినిమా నిర్మాణం కోసమని తమ దగ్గర అప్పులు తీసుకున్నారనీ… ఇప్పుడు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనీ వాళ్ళు ఆరోపించారు. అప్పట్లో రాజశేఖర్ హీరోగా విడుదలైన గరుడ వేగ సినిమా నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు.

దాంతో రాజశేఖర్ ఫ్యామిలీనే నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. రాజశేఖర్ ఆస్తులు తాకట్టుపెట్టి తమ దగ్గర నుంచి 26 కోట్ల రూపాయలు తీసుకున్నారని జోస్టర్ ఫిలిం సభ్యులు చెప్పారు. అప్పట్లో జీవిత తమ దగ్గరికొచ్చి చాలా ఎమోషనల్ అయ్యారనీ.. రాజశేఖర్ తండ్రి వరదరాజన్ చెప్పడంతో.. ఆస్తులు తాకట్టు పెట్టుకుని డబ్బులిచ్చామనీ వాళ్ళు చెప్పారు.
కానీ, ఆ తర్వాత రాజశేఖర్ జీవిత తమ నిజస్వరూపం చూపించారు అని, వాళ్ళు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మోసానికి సంబంధించి తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయంటున్నారు జోస్టర్ ఫిలిం సర్వీస్ డైరెక్టర్ కోటేశ్వర్ రాజు, ఎండీ హేమ తెలియజేశారు.

మొత్తానికి హీరో రాజశేఖర్, జీవితలు మోసం చేశారంటూ మీడియా ముందుకు జోస్టర్ ఫిలిం సర్వీసెస్ వారు చెప్పడం కలకలం రేపుతోంది. రాజశేఖర్ ఫ్యామిలీ తమ ఆస్తులు తాకట్టుపెట్టి రూ.26 కోట్లు ఎగురవేశారని జోస్టర్ ఫిలిం సర్వీసెస్ వారు ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆస్తులను బినామిలా పేరుతో మార్చుకుని మమ్మల్ని మోసం చేశారనీ చెప్పారు.
Recommended Videos:
[…] Also Read: Jeevitha Rajashekar: టాలీవుడ్‌లో కలకలం.. జీవితరాజశ… […]
[…] Also Read: Jeevitha Rajashekar: టాలీవుడ్‌లో కలకలం.. జీవితరాజశ… […]
[…] Also Read: Jeevitha Rajashekar: టాలీవుడ్‌లో కలకలం.. జీవితరాజశ… […]
[…] Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ విడుదలైంది. చెప్పినట్టుగానే ఈ పాట రికార్డుల మోత మోగిస్తోంది. ‘సరా సరా సర్కారు వారి పాట… షురూ షురూ అన్నాడురా అల్లూరి వారి బేటా…’ అంటూ సాగిన ఈ టైటిల్ సాంగ్ చాలా బాగా ఆకట్టుకుంటోంది. మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ అందించిన ట్యూన్ పక్కా కమర్షియల్ ఫార్మేట్‌లో సాగింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. […]