Homeఎంటర్టైన్మెంట్‘కేస్‌ 99’ ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన బోయపాటి శ్రీను

‘కేస్‌ 99’ ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన బోయపాటి శ్రీను


మానవ సంబంధాలే ముఖ్య ఆయుధాలుగా తెరకెక్కిన చిత్రం ‘కేస్‌ 99’. ప్రియదర్శిని రామ్‌ నటించి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. శనివారం ‘కేస్‌99’ చిత్ర ఫస్ట్‌లుక్‌ను మాస్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను విడుదల చే శారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ–‘‘ ప్రియదర్శిని రామ్‌గారు అనగానే నాకు గుర్తొచ్చేది, తాను ఏ పనిచేసినా ప్రాణం పెట్టి చేస్తాడు. ఈ సినిమాలో పాలుని,నీటిని వేరుచేసే హంస లాంటి పాత్రతో సమాజంలో జరిగే చెడును బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన దౌర్జన్యానికి మానవసంబంధాలే కారణమని అందరూ ఆలోచిన్తున్న సమయంలో వస్తున్న చిత్రమిది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.

Also Read: అనుష్కనే కావాలి.. ఆ దర్శకుడికి ఫ్యాన్స్ రిక్వెస్ట్..!

దర్శకుడు రామ్‌ మాట్లాడుతూ– ‘‘గ్రేట్‌ టెక్నీషియన్‌ అంతకంటే మంచి మనసున్న వ్యక్తి బోయపాటి శ్రీను. మట్టిని న మ్ముకుని సాదారణ జీవితం నుండి పైకొచ్చిన వ్యక్తి బోయపాటి. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లాంటి ఓటీటీలో ఎక్కడ చూసినా పదికి ఏడు సినిమాలు క్మైమ్‌థ్రిల్లర్‌లే ఉంటున్నాయి. క్రైమ్‌ సినిమాలే ఎందుకుంటున్నాయంటే సమాజంలో జరుగుతున్నాయి కాబట్టే ఉంటున్నాయి. వాటన్నింటిని నేను పరిష్కరించలేనుగాని నా వంతుగా చక్కని సినిమా తీయాలి అనిపించింది. వారం పదిరోజుల్లో సినిమాకి సంబంధించిన ఫస్ట్‌కాపీ రెడీ అవుతుంది. సినిమా ప్రయాణాన్ని చాలా ఎంజాయ్‌ చేశాం. దానికి కారణం కొత్త రక్తంతో వస్తున్న యువనిర్మాతలు గౌతమ్, కీర్తీ, వివేక్‌లు తమ మెలోడ్రామా అనే కంపెనీ ద్వారా నాకు చక్కని అవకాశాన్ని ఇచ్చారు. వారందరికి మాట ఇస్తున్నాను. నేను చాలా మంచి సినిమా తీశానని’’ అన్నారు.

Also Read: రాజమౌళి పై ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఫిర్యాదులు !

నిఖిల్‌ ,అనువర్ణ, జంటగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో ‘పలాస’ఫేమ్‌ తిరువీర్‌ , అపరాజిత, రోషన్, అజయ్,అశోక్‌రావ్,ప్రణీత పట్నాయక్‌ (కేర్‌ ఆఫ్‌ కంచెరపాలెం) , క్రిష్‌రాజ్,మనోజ్‌ ముత్యం,విజయ్‌ గోపరాజుతదితరులు నటిస్తున్నారు.

Case 99 Telugu Movie Motion Poster | Priyadarshini Ram | Thiruveer | Ashic Arun | Telugu FilmNagar

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version