కరోనా లాక్ డౌన్ తో ఇప్పుడు చిత్రాలన్నీ ఓటీటీలలోనే రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ‘వీ’, ‘నిశ్శబ్ధం’ లాంటి పెద్ద చిత్రాలు రిలీజ్ అయినా కూడా పెద్దగా హిట్ టాక్ సొంతం చేసుకోలేకపోయాయి. కానీ తమిళ స్టార్ హీరో సూర్య తీసిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం నిన్న అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ రియల్ బయోపిక్ స్టోరీ ఆకట్టుకుంది. చాలా పోరాటం తర్వాత ఎయిర్ దక్కన్ ప్రారంభించిన కెప్టెన్ గోపీనాథ్ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.
Also Read: టాలీవుడ్ అప్డేట్.. సంక్రాంతి ఆశలు కూడా గల్లంతేనా?
కాగా తాజాగా తన కథను సినిమాగా తీసిన ఈ చిత్రాన్ని కెప్టెన్ గోపీనాథ్ చూశాడు. దీనిపై ఒక వివరణాత్మక సమీక్షను పోస్ట్ చేశాడు. “సూర్య నటన శక్తివంతంగా సాగింది. కలలు నిజం చేసుకునేందుకు ఒక పిచ్చిగా ప్రయత్నించే మనిషి పాత్రలో జీవించేశాడు. దానికోసం తపనపడే ఒక వ్యవస్థాపకుడిలోకి ప్రవేశించి ఇందులో జీవించేశాడు.. ఈ చీకటి సమయాల్లో బయటకొచ్చిన అద్భుతమైన కథ ఇదీ.. గొప్ప ఉత్సాహభరితమైన కథ అనడంలో ఎలాంటి సందేహం లేదు ” అని గోపినాథ్ ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు.
Also Read: ధర్మవరపు సుబ్రహ్మణ్యం చివరి రోజుల్లో సినిమావాళ్లను ఎందుకు దూరం పెట్టాడు?
ఈ చిత్రంలోని కథ నిజంగానే తన జీవితంలో జరిగిందా లేదా కొన్ని కల్పించారా అన్న దానిపై కూడా గోపీనాథ్ వివరణ ఇచ్చారు. ఇందులో మెయిన్ కథ నిజంగానే జరగగా.. పలు సన్నివేశాలు కథ కోసం కల్పించారని తెలిపారు. అన్నింటికంటే మించి ఈ చిత్రం చాలా కల్పితమైనదని.. అయితే భావోద్వేగాలకు అనుగుణంగా బాగా తీశారని.. సూర్య, కథానాయిక అపర్ణ, బాలమురళి నటనలను ఆస్వాదించాడని గోపీనాథ్ చెప్పారు. ఈ మేరకు కెప్టెన్ గోపినాథ్ ట్వీట్ చేశాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్