https://oktelugu.com/

టాలీవుడ్ అప్డేట్.. సంక్రాంతి ఆశలు కూడా గల్లంతేనా? 

దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సినిమా రంగం తీవ్రంగా కుదేలవుతోంది. గత ఆరేడు నెలలుగా షూటింగులు బంద్ కాగా.. థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే షూటింగులు.. థియేటర్లు మొదలైన కరోనా భయం మాత్రం టాలీవుడ్ ను వెంటాడుతోంది. షూటింగు సమయాల్లో ఇప్పటికే పలువురు నటీనటులు కరోనా బారినపడటంతో వారిలో మరింత ఆందోళన మొదలైంది. Also Read: ‘ఆర్ఆర్ఆర్’ తాజా సర్ ప్రైజ్ కి రీజన్ అదే ! మరోవైపు థియేటర్ల పరిస్థితి కూడా ఆశాజనకం కన్పించడంలేదు. అక్టోబర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 13, 2020 7:11 pm
    Follow us on

    Tollywood
    దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సినిమా రంగం తీవ్రంగా కుదేలవుతోంది. గత ఆరేడు నెలలుగా షూటింగులు బంద్ కాగా.. థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే షూటింగులు.. థియేటర్లు మొదలైన కరోనా భయం మాత్రం టాలీవుడ్ ను వెంటాడుతోంది. షూటింగు సమయాల్లో ఇప్పటికే పలువురు నటీనటులు కరోనా బారినపడటంతో వారిలో మరింత ఆందోళన మొదలైంది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ తాజా సర్ ప్రైజ్ కి రీజన్ అదే !

    మరోవైపు థియేటర్ల పరిస్థితి కూడా ఆశాజనకం కన్పించడంలేదు. అక్టోబర్ 15నుంచి 50శాతం అక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలచ్చినా పూర్తిస్థాయిలో తెరుచుకోవడంలేదు. కరోనా ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు జంకుతున్నారు.

    దీనికితోడు థియేటర్లు 50శాతం అక్యుపెన్సీతో నడిచినా డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం పూర్తిస్థాయిలో రెంట్ ఇవ్వాల్సిందే. దీంతో థియేటర్లో ఓనర్లకు.. డిస్ట్రిబ్యూటీర్ల మధ్య డీల్ కుదరడం లేదు. మరోవైపు సగం మంది ప్రేక్షకులతో థియేటర్లు రన్ చేసినా టికెట్ రేటు పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి టికెట్ రేట్ పెంచితే చిన్న సినిమాలను చూసేందుకు జనాలు థియేటర్లకు రాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తవుతోంది.

    Also Read: ధర్మవరపు సుబ్రహ్మణ్యం చివరి రోజుల్లో సినిమావాళ్లను ఎందుకు దూరం పెట్టాడు?

    థియేటర్లు వందశాతం అక్యుపెన్సీతో నడిస్తే వాటి ఓనర్లకు.. డిస్ట్రిబ్యూటర్లకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. సంక్రాంతి వరకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో థియేటర్లకు అనుమతి ఇవ్వకుంటే పెద్ద సినిమాలు థియేటర్లలో వచ్చే అవకాశం లేదనే టాక్ విన్పిస్తోంది. ప్రతీ సంక్రాంతికి టాలీవుడ్లోని సినిమాలు 400కోట్ల బిజినెస్ చేస్తాయని టాక్.

    ఇప్పటికే దసరా.. దీపావళి సీజన్లను కోల్పోయిన టాలీవుడ్ సంక్రాంతి బిజినెస్ ను కూడా కోల్పోతే ఈ ఎఫెక్ట్ భారీగా ఉంటుందనే టాక్ విన్పిస్తోంది. దీంతో ఈసారి సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తాయా? లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు ఇప్పటికే సంక్రాంతి రేసులో ఉన్నాయి. అయితే థియేటర్లు పుల్ రన్ తో నడిస్తేనే సంక్రాంతికి సినిమాలను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో సంక్రాంతి నాటికి పరిస్థితులు ఎలా మారుతాయనేది ఆసక్తిని రేపుతున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్