https://oktelugu.com/

Acharya: ఆచార్య లో ఆ సన్నివేశం కి ఏడుపు ఆపుకోలేమా..?

Acharya: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూసిన ఆచార్య సినిమా ఎట్టకేలకు రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా 2000 కి పైగా థియేటర్స్ లో విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యింది..ఇప్పటి వరుకు ఈ సినిమా నుండి విడుదల అయినా పాటు మరియు ట్రైలర్ అభిమానులను మరియు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడం తో ఈ మూవీ పై ట్రేడ్ సర్కిల్ లో కూడా అంచనాలు తారా స్థాయికి చేరాయి..మేకర్స్ కూడా రోజురోజుకి ఈ సినిమా మీద అంచనాలు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 28, 2022 / 03:40 PM IST
    Follow us on

    Acharya: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూసిన ఆచార్య సినిమా ఎట్టకేలకు రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా 2000 కి పైగా థియేటర్స్ లో విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యింది..ఇప్పటి వరుకు ఈ సినిమా నుండి విడుదల అయినా పాటు మరియు ట్రైలర్ అభిమానులను మరియు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడం తో ఈ మూవీ పై ట్రేడ్ సర్కిల్ లో కూడా అంచనాలు తారా స్థాయికి చేరాయి..మేకర్స్ కూడా రోజురోజుకి ఈ సినిమా మీద అంచనాలు పెరిగేలా క్రేజీ ప్రొమోషన్స్ మరియు ఇంటర్వూస్ చేస్తూనే ఉన్నారు..ఈ సినిమాని ఒక్క పక్క నిర్మిస్తూనే మరో పక్క ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన రామ్ చరణ్ కూడా ఈ మూవీ ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు..ఇక ఇటీవల విడుదల అయినా చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ ఇంటర్వూస్ అభిమానులకు కనుల పండుగగా మారింది..ఈ ఇంటర్వూస్ లో చిరంజీవి ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పి అభిమానుల్లో ఈ సినిమా పై మరింత ఆసక్తిని రేపెలా చేసాడు.

    Acharya

    ఒక్క సన్నివేశం లో రామ్ చరణ్ చేసిన నటన కి తన కళ్ళలో నుండి నీళ్లు వచ్చాయి అని..ఆ షాట్ అయ్యిపోయిన తర్వాత కొరటాల శివ గారు లంచ్ బ్రేక్ అని మైక్ లో గట్టిగ అరిచినా కూడా ఎవ్వరు కదలలేకపొయ్యారు అని చిరంజీవి గారు ఈ సందర్భం లో చెప్పారు..ఎంత కఠినాత్ముడు అయినా కూడా ఈ సన్నివేశం కి కంటతడి పెట్టకుండా ఉండలేరు అని..రామ్ చరణ్ ఆ స్థాయిలో ఆ పాత్రని రక్తికటించాడు అంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి..ఈ సినిమా క్లైమాక్స్ కి ముందు వస్తుంది అట..మెగాస్టార్ చిరంజీవి వంటి అనుభవం గల నటుడిని కదిలించే రేంజ్ లో రామ్ చరణ్ నటించిన ఆ సన్నివేశం ని చూడడానికి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు..సెకండ్ హాఫ్ మొత్తం ఒక్క రేంజ్ మాస్ ఫైట్స్ తో హృదయాలకు హత్తుకునే స్థాయి ఎమోషన్స్ తో ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు అట ఈ సినిమాని కొరటాల శివ.

    Also Read: Gandhi Hospital: ఆరోగ్యశాఖ మంత్రి ఈటలనే.. గాంధీ ఆస్పత్రి చెబుతోంది రాసుకోండి..

    Acharya

    ఇక ఈ సినిమాలో పాటలు అన్ని సూపర్ హిట్ గా నిలిచినా సంగతి మన అందరికి తెలిసిందే..ముఖ్యంగా లాహే లాహే పాటకి యూట్యూబ్ లో దాదాపుగా 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి..ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి వేసిన స్టెప్స్ అభిమానులను ఉర్రూతలూ ఊగిస్తాయి అట ..ఇప్పటికే ఈ పాటకి సంబంధించిన చిరంజీవి డాన్స్ ప్రోమో కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..మరి రేపు థియేటర్స్ లో ఈ పాత వచ్చినప్పుడు అభిమానులు వెర్రిక్కిపోవడం ఖాయం..ఇక చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన డాన్స్ నెంబర్ ‘భలే భలే బంజారా’ సాంగ్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఈ పాట తో సినిమా మీద ఉన్న అంచనాలు పదింతలు ఎక్కువ అయ్యాయి..అలా మ్యూజిక్ పరంగా మరియు కంటెంట్ పరంగా చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో ఒక్క అద్భుతమైన సినిమా రాబోతుంది అని..రికార్డ్స్ అన్ని బ్లాస్ట్ అవ్వడం ఖాయం అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త…ఇంతతి భారీ స్థాయి అంచనాలు ఏర్పర్చుకున్న ఈ సినిమా విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

    Also Read: Acharya: ‘ఆచార్య’ చూసిన వారంతా చెప్పిన ఒకే ఒక్క మాట.. ఇదే !

    Tags