https://oktelugu.com/

TRS Pleanary: కలకలం: మంత్రిని చంపాలనుకున్న ఆ నిందితుడు టీఆర్ఎస్ ప్లీనరీకి ఎలా వచ్చాడు?!

TRS Pleanary: టీఆర్‌ఎస్‌ పుట్టిన రోజు పండుగలో తీర్మాన బాణాలు.. విమర్శలు, కౌంటర్‌ అటాకే కాదు.. ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం చేశారంటూ పోలీసులు అరెస్ట్‌ చేసిన మహబూబ్‌నగర్‌కు చెందిన నిందితుల్లో కీలకమైన మున్నూరు రవి ప్లీనరీలో తలుక్కు మన్నాడు. పార్టీ వేడుకకు హాజరై.. పార్టీ నేతలతో కలిసి ఫొటోలు దిగాడు. ఈ వ్యవహారం పార్టీ ప్లీనరీలో కలకలం రేపింది. -సెక్యూరిటీ.. బార్‌కోడ్‌ పాస్‌.. పార్టీ ప్లీనరీకి హాజరయ్యే నేతలకు పార్టీ సెక్యూరిటీ, […]

Written By:
  • NARESH
  • , Updated On : April 28, 2022 3:40 pm
    Follow us on

    TRS Pleanary: టీఆర్‌ఎస్‌ పుట్టిన రోజు పండుగలో తీర్మాన బాణాలు.. విమర్శలు, కౌంటర్‌ అటాకే కాదు.. ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం చేశారంటూ పోలీసులు అరెస్ట్‌ చేసిన మహబూబ్‌నగర్‌కు చెందిన నిందితుల్లో కీలకమైన మున్నూరు రవి ప్లీనరీలో తలుక్కు మన్నాడు. పార్టీ వేడుకకు హాజరై.. పార్టీ నేతలతో కలిసి ఫొటోలు దిగాడు. ఈ వ్యవహారం పార్టీ ప్లీనరీలో కలకలం రేపింది.

    -సెక్యూరిటీ.. బార్‌కోడ్‌ పాస్‌..
    పార్టీ ప్లీనరీకి హాజరయ్యే నేతలకు పార్టీ సెక్యూరిటీ, బార్‌ కోడ్‌ ఉన్న పాసులు జారీ చేసింది. పాసు ఉన్న వారే పార్టీ వేడుకకు హాజరు కావాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. మున్నూరు రవికి ఈ పాస్‌ లేకున్నా అతడు పార్టీ ప్లీనరీకి హాజరయ్యాడు. కేవలం పార్టీ ఐడీ కార్డుతో మున్నూరు రవి పార్టీ వేడుకకు హాజరయ్యాడని ఆ తర్వాత తెలిసింది. పార్టీ వేడుకలో అధినేత కేసీఆర్‌ కీలక ప్రసంగం చేస్తున్న సమయంలో కూడా మున్నూరు రవి ఇంకా అక్కడే ఉన్నాడు. దీనిపై ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ లీడర్లతో మున్నూరు రవి ఫొటోలు దిగారు. పాస్‌ లేకుండా ఎలా వచ్చాడనే చర్చతో అక్కడి నుంచి రవి వెంటనే వెళ్లిపోయాడు. సోషల్‌ మీడియాలో ఫొటోలు పెట్టి మున్నూరు రవి వెంటనే డిలీట్‌ చేశారు.

    -ఆహ్వానం అందిందా?
    టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి పది రోజులుగా ఏర్పాట్లు జరిగాయి. సమావేశానికి ముందు సభా ప్రాంగణాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పకడ్బందీ సెక్యూరిటీ, అణువనువూ తనిఖీ చేశారు. సమావేశం రోజు కూడా బార్‌ కోడ్‌తో ఉన్న పాస్‌ ఉంటేనే లోని అనుమతించారు. అయినప్పటికీ మున్నూరు రవి సభా ప్రాంగణంలో తళుక్కుమన్నాడు. మంత్రి హత్యాయత్నం కేసులో నిందితుడు.. పార్టీ ప్రధాన వేడుకకు రావడం కలకలం రేపింది. రవికి ఆహ్వనం అందితేనే ఇక్కడకు వచ్చాడని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. లేకుంటే ఇంత పకడ్బందీ సభకు మంత్రి హత్య కేసులో నిందితుడు అంత ఈజీగా ఎలా రాగలిగాడన్న సందేహాలు తలెత్తుతున్నాయి. రవికి అండగా ఎవరు ఉన్నారు.. అనే విషయం ఉప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. ప్లీనరీ ఏర్పాట్లను అన్నీ తానై చూసుకున్న పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ చూసుకున్నారు. ఆయనకు తెలియకుండా ఈగ కూడాలోనికి రాదు. ఒక్క పాస్‌ కూడా జారీ కాదు. అయినా మున్నూరు రవి ప్రాంగణానికి రాగలిగారంటే.. కేటీఆర్‌ లేదా సీఎం కేసీఆర్‌ ఆశీస్సులు ఉండి ఉంటాయన్నా చర్చ జరుగుతోంది. కేసీఆర్, కేటీఆర్‌కు తెలియకుండా ఎవరూ రవిని అక్కడికి తీసుకురాలేదు. గులాబీ బాస్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అనుమతి ఇచ్చి ఉంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, సీఎంకు అత్యంత సన్నిహిత మంత్రి అయిన శ్రీనివాస్‌గౌడ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడికి గులాబీ పుట్టిన రోజు వేడుకలకు ఆహ్వానం అందడం వెనుకు రాజకీయ పరమైన ప్రయోజనం ఏమైనా ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.