ఎలాగూ ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి, బడ్జెట్ కూడా అంతే స్థాయిలో అవుతుంది. సో.. రెండు పార్ట్స్ అంటే.. రెండు సినిమాల మార్కెట్. కాబట్టి.. బడ్జెట్ ఎక్కువ అయినా పోయేది ఏమి లేదు. ఈజీగా రాబట్టుకోవచ్చు. అందుకే బన్నీతో పాటు నిర్మాతలు కూడా సుక్కు ఆలోచనను మెచ్చుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
ఇక మన దేశంలో ఉన్న కరోనా కఠిన పరిస్థితులు కుదుటపడి, అన్ని అనుకున్నట్టే జరిగితే ఈ ఏడాది చివర్లో ‘పుష్ప’ మొదటి భాగాన్ని విడుదల చేస్తారని… అందుకు తగ్గట్లుగానే సుక్కు షూటింగ్ ను కూడా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాదిలో రెండో భాగాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయట.
ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. కాగా శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమాలో విలన్ గా ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఎలాగూ ఫహద్ వల్ల తమిళనాడులో, కేరళలో కూడా సినిమాకి మంచి మార్కెట్ అవుతుంది.