ఈటలకు ధీటైన వ్యక్తి కోసం ఆరా..

రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే ఆ స్థానంలో ఎవరని నిలబెట్టాలనే ఆలోచనలో అధిష్టానం తలమునకలవుతోంది. ఈటల రాజేందర్ ను ఎదుర్కొని సమర్థంగా ఉండే వారి కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ఈటలను మట్టి కరిపించి అక్కడ తన ప్రాభవాన్ని నిలబెట్టుకోవాలనే కృతనిశ్చయంతో పార్టీ ఉన్నట్లు తెలిసింది. గతంలో హుజూరాబాద్ కమలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా హుజూరాబాద్ కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు కమలాపూర్ హన్మకొండ పార్లమెంట్ నియోజకవర్గంలో […]

Written By: NARESH, Updated On : May 6, 2021 6:18 pm
Follow us on

రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే ఆ స్థానంలో ఎవరని నిలబెట్టాలనే ఆలోచనలో అధిష్టానం తలమునకలవుతోంది. ఈటల రాజేందర్ ను ఎదుర్కొని సమర్థంగా ఉండే వారి కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ఈటలను మట్టి కరిపించి అక్కడ తన ప్రాభవాన్ని నిలబెట్టుకోవాలనే కృతనిశ్చయంతో పార్టీ ఉన్నట్లు తెలిసింది. గతంలో హుజూరాబాద్ కమలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా హుజూరాబాద్ కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు కమలాపూర్ హన్మకొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండేది. అప్పుడు ఎంపీగా ఉన్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను ప్రస్తుతం హుజూరాబాద్ నుంచి పోటీ చేయించాలనే భావిస్తున్నారని తెలిసింది.

ఈటలకు చెక్ పెట్టేందుకే..
టీఆర్ఎస్ లో ఈటల రాజేందర్ కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే గులాబీ పార్టీ ఉన్నట్లు పరిణామాల ద్వారా విదితమవుతోంది. రాజకీయ దురంధరుడిగా పేరుపొందిన ఈటలను ఇంటికి సాగనంపాలనే ప్రధాన నిర్ణయంతో పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈటల రాజీనామా చేస్తే ఆయనను సమర్థంగా ఎదుర్కొనే వారిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈటలను ఓడించి రాజకీయంగా దూరం చేయాలనే తలంపులో టీఆర్ఎస్ ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది.

ఇతర పార్టీల నుంచి వలసలు
హుజూరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని బీజేపీ, కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు కోరినట్లు తెలిసింది. వారి కోరికను పరిశీలిస్తామని అధిష్టానం సమాధానం చెప్పినట్లు తెలిసింది. గులాబీ పార్టీ నేతలు మాత్రం ఈటల రాజేందర్ ను ఎదుర్కొనే సత్తా వినోద్ కుమార్ కే ఉన్నట్లు తెలిపినట్లు తెలిసింది. పైగా ఈ ప్రాంతంపై అవగాహన ఉన్న వ్యక్తిగా కూడా ఆయన అభ్యర్థిత్వానికే మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఇదే జరిగితే ఇన్నాళ్లు కలిసికట్టుగా తిరిగిన వ్యక్తుల మధ్యే పోరు ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆత్మాభిమానానికే పెద్దపీట
ఈటల రాజేందర్ పదవుల కంటే ఆత్మాభిమానానికే ప్రాధాన్యమిస్తారనే ప్రచారం ఉంది. అధిష్టానం పార్టీ నుంచి ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించకముందే రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలిసింది. గులాబీ పార్టీ కూడా రాజేందర్ ను శాశ్వతంగా ఇంటికి పంపించాలనే నిర్ణయంతో ఉందని పలువురు నాయకుల ద్వారా తెలిసింది. ఈ ఎన్నికలో వినోద్ కుమార్ విజయం సాధిస్తే ఆయనను మంత్రి పదవిలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే ఈటల రాజేందర్ కోట నుంచి సముచిత ప్రాధాన్యమిచ్చేందుకే మొగ్గు చూపుతున్నారని పలువురి అభిప్రాయం.

వినోద్ కుమార్ కే ప్రాధాన్యత
టీఆర్ఎస్ అధిష్టానం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ భవితవ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది. ఈటల రాజేందర్ పై విజయం సాధిస్తే మంత్రి పదవి కట్టబెడుతూ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా సేవలందించేందుకు ఆయనకు అవకాశం కల్పిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏది ఏమైనా టీఆర్ఎస్ లో రాజకీయ పరిణామాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈటలపై వేటు ఆ తర్వాత వినోద్ కుమార్ అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకోోవడం వెనుక పలు ఆసక్తి కర విషయాలు ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.