కరోనా క్రైసిస్ తో సినిమారంగం కుదేలైంది. గత ఆరేడు నెలలుగా సినిమా షూటింగులు నిలిచిపోగా.. థియేటర్లు.. మల్టిపెక్సులు పూర్తిగా మూతపడ్డాయి. కొన్నినెలల క్రితం షూటింగులు ప్రారంభంకాగా అక్టోబర్ 15 నుంచి థియేటర్లు.. మల్టిపెక్సులు ఓపెన్ అయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూనే 50శాతం అక్యుపెన్సీతో థియేటర్లు.. మల్టిపెక్సులు ఓపెన్ చేసుకోవాలని ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడుదల చేయడం వీటికి భారంగా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
గత ఆరేడు నెలులుగా థియేటర్లు.. మల్టిపెక్సులు పూర్తిగా మూతపడటంతో ఈ రంగంపై ఆధారపడిన వేలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు. అయితే ఇటీవల థియేటర్లు ఓపెన్ అయినా కరోనా నిబంధనలతో వాటికి నిర్వహాణ ఖర్చులు కూడా రావడం లేదు. దీంతో థియేటర్లను పరిమిత సంఖ్యలో నడిపిస్తుండగా మల్టిపెక్సులు మాత్రం ఓపెన్ చేసేందుకు యాజమాన్యాలు వెనుకంజ వేస్తున్నాయి.
Also Read: ‘లవ్ స్టోరీ’ రెడీ.. మరి రిలీజ్ పరిస్థితేంటి ?
ఇప్పటికే గత ఏడునెలలుగా మల్టిప్లెక్సులు మూతపడటంతో ఇప్పటికే పెద్దఎత్తున వీటి యజమానులు నష్టపోయారు. కరోనా నిబంధనలతో అదనపు భారం పడుతుండటంతో వీటిని ఓపెన్ చేసేందుకు యజమానులు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. మల్టిప్లెక్సులు పూర్తిగా మూతబడి ఉండటంతో వేలాది మంది ఉద్యోగులను నిర్వహాకులు తీసేశారు. కొందరు శాశ్వత ఉద్యోగులను మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగిస్తూ వారికి లక్షల్లో జీతాలు ఇస్తున్నారు.
Also Read: ఆర్ఆర్ఆర్: చరణ్ వర్సెస్ ఎన్టీఆర్.. సరికొత్త ట్విస్ట్.!
గత మూడునెలలో పీవీఆర్ సంస్థకు ఆదాయం లేకపోగా దాదాపుగా రూ.185కోట్ల నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. థియేటర్ల మెయింటెన్స్.. సిబ్బంది జీతాలను ఇవ్వడానికి చాలా మల్టిప్లెక్స్ యాజమాన్యాలు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాదికి దాదాపుగా అన్ని మల్టిప్లెక్సులు వందల కోట్లలో నష్టాలను చవిచూశాయి. ప్రతీయేటా కోట్లలో లాభాలు గడించే మల్టిపెక్సులకు 2020 సంవత్సరం పెద్ద నష్టాలను మిగిల్చింది. వచ్చే ఏడాదైనా ఈ మల్టిపెక్సులు తలరాత మారుతుందో లేదో వేచిచూడాల్సిందే..!