బండి సంజయ్ కోసం ఒంటికి నిప్పంటించుకున్న కార్యకర్త మృతి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను తట్టుకోలేక హైదరాబాద్ లోని నాంపల్లిలో గల బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు శ్రీనివాస్ మృత్యువుతో పోరాడి ఈరోజు తనువు చాలించాడు. కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచాడు. 44శాతం కాలిన గాయాలతో శ్రీనివాస్ ఆస్పత్రిలో చేరాడు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా లక్ష్మణ్, […]

Written By: NARESH, Updated On : November 5, 2020 8:02 pm
Follow us on

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను తట్టుకోలేక హైదరాబాద్ లోని నాంపల్లిలో గల బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు శ్రీనివాస్ మృత్యువుతో పోరాడి ఈరోజు తనువు చాలించాడు. కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచాడు. 44శాతం కాలిన గాయాలతో శ్రీనివాస్ ఆస్పత్రిలో చేరాడు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా లక్ష్మణ్, రాంచంద్రారెడ్డి, ప్రేమేందర్ రెడ్డి తదితరులు వచ్చి పరామర్శించారు. శ్రీనివాస్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అయినా అతడి ప్రాణాలు దక్కలేదు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ శ్రీనివాస్ సూసైడ్ అంటెప్ట్ చేసుకోగా తీవ్రంగా మంటలు చెలరేగడంతో స్థానికులు అతడిపై నీళ్లు చల్లి మంటలు ఆర్పారు. పార్టీ శ్రేణులు, పోలీసులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పి యువకుడిని వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.

Also Read: కేసీఆర్‌‌కే తలనొప్పి తెచ్చాయే!

దుబ్బాక ఎన్నికల వేళ నోట్ల కట్టలు బయటపడడం.. నిరసన కోసం ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే..బండి సంజయ్ అరెస్ట్ ను తట్టుకోలేని శ్రీనివాస్ అనే యువకుడు హైదరాబాద్ లోని నాంపల్లిలో గల బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.

బండి సంజయ్ అరెస్ట్ అయ్యాక జీర్ణించుకోలేకపోయానని అందుకే ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నానని శ్రీనివాస్ తెలిపారు. బండి సంజయ్ కోసం, అరవింద్ కోసం.. రఘునందన్ కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని.. బీజేపీ నేతలను సీఎం కేసీఆర్ ఏమీ చేయలేడని శ్రీనివాస్ కాలిన గాయాలతోనే నినాదాలు చేశారు.

Also Read: అమరావతి భూకుంభకోణం: టీడీపీ నేతలకు ‘సుప్రీం’ నోటీసులు

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోని గూడెం శ్రీనివాస్ సొంతూరు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నేతలు తీవ్ర విచారణం వ్యక్తం చేశారు. కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.