Mahesh Babu- Rajamouli: రాజమౌళి సినిమా వస్తుంది అంటే అంచనాలు భారీగా ఉంటాయి. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్లు ప్యాన్ వరల్డ్ స్టార్లుగా ఎదిగారంటే దానికి కారణం దర్శక ధీరుడు రాజమౌళి. తెలుగు సినిమాల ఖ్యాతిని హద్దులు దాటించిన ఘనత కూడా రాజమౌళికే దక్కుతుంది. మరి రాజమౌళి నెక్ట్స్ సినిమా ఏంటి అని అందరూ ఆరా తీస్తున్న సమయంలో మహేష్, జక్కన్న కాంబోలో సినిమా రానుందనే వార్తతో ఫుల్ ఖుషీ అయ్యారు ఇద్దరి స్టార్ల అభిమానులు.
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో సినిమా రాబోతుందని గత కొంత కాలంగా టాక్ వినిపిస్తున్నా..దీనికి సంబంధించిన అప్డేట్ లేదు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వచ్చే సంవత్సరంలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురానున్నారు మేకర్స్. పాన్ ఇండియా మూవీలా కాకుండా పాన్ వరల్డ్ మూవీలా జక్కన్న ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాను రాజమౌళి చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారట. రాజమౌళి సినిమాలు అంటే ఎక్కువ సమయం తీసుకుంటాడు. కానీ ఈ సారి అలా కాకుండా ఒక సంవత్సరంలోనే కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారట. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు ఫుల్ ఫోకస్ గా జక్కన్న సినిమాపైనే ఇంట్రెస్ట్ పెడుతారని టాక్. ఆ సినిమా షూటింగ్ ను 2024లోనే పూర్తి చేసి… 2025లో ఆరు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకోవాలని.. ఆ తర్వాత 2025లో సినిమాను విడుదల చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారు.
రాజమౌళి, మహేష్ కాంబోలో సినిమా.. ప్లానింగ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ.. రాజమౌళి క్వాలిటీ విషయంలో రాజీపడడు. అలాగే ఏ సీన్ అయినా సరే.. తను అనుకున్న విధంగా వచ్చే వరకు కాంప్రమైజ్ కాడు. అందుచేత 2025లో సినిమాను రిలీజ్ చేయాలనే టార్గెట్ రీచ్ కావడం కాస్త కష్టమే. అయితే మరో ఇంట్రెస్టింగ్ ఏంటంటే.. లేట్ అయినా లేటెస్ట్ గా వస్తారు అన్నట్టు.. సినిమాకు సమయం తీసుకున్నా.. హిట్ పక్కా ఉంటుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలతో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పాన్ వరల్డ్ స్టార్లు అయ్యారు. దీంతో ఈ సారి మహేష్ కూడా పాన్ వరల్డ్ స్టార్ అని ముందే ఫిక్స్ అయ్యారు అభిమానులు.
పక్కా ప్లానింగ్, ప్రేక్షకులకు కావాల్సిన ఎమోషన్స్, స్టోరీ ఇవ్వడంలో రాజమౌళికి తిరుగు ఉండదు. అలాంటప్పుడు సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుంది. అంటే మహేష్, జక్కన్న కాంబోలో వచ్చే సినిమా కూడా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. కాబట్టి మా మహేష్ కూడా పాన్ వరల్డ్ స్టార్ గా ఎదగడం పక్కా అంటూ ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.