https://oktelugu.com/

Star Directors: ఒక్క సక్సెస్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్న స్టార్ డైరెక్టర్స్ వీళ్లే…

స్టార్ డైరెక్టర్లందరూ కూడా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధించి తమకంటూ ఉన్న గుర్తింపును తారస్థాయిలోకి చేర్చుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : May 11, 2024 / 12:19 PM IST

    Can 2024 Deliver Hits To Flop Directors

    Follow us on

    Star Directors: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పాటు స్టార్ డైరెక్టర్ల హవా కూడా కొనసాగుతుంది. ఇంకా ఇప్పటికే పాన్ ఇండియాలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ డైరెక్టర్లు అందరూ కూడా ఇక మొదట కూడా వరుసగా సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరూ కూడా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధించి తమకంటూ ఉన్న గుర్తింపును తారస్థాయిలోకి చేర్చుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ఒక ముగ్గురు దర్శకులు ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కూడా కంబ్యాక్ ఇస్తూ భారీ సక్సెస్ లను కొట్టాలని చూస్తున్నారు.

    ఇక అందులో ముఖ్యంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ శంకర్ ఒకరు. ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకి ముందు ఆయన చేసిన ఐ, రోబో 2.0 లాంటి సినిమాలు ప్లాప్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాతో మరొకసారి తను బౌన్స్ బ్యాక్ అవ్వాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…

    ఇక ఒక్క సక్సెస్ తో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలనుకుంటున్న మరొక దర్శకుడు కొరటాల శివ.. ఈయన ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఎన్టీయార్ హీరోగా దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ హిట్ అందుకొని దాదాపు 1000 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది…

    ఇక వీళ్లిద్దరితోపాటు యంగ్ డైరెక్టర్ అయిన సుజీత్ కూడా తను పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమాతో మళ్లీ సక్సెస్ బాట పట్టాలని చూస్తున్నాడు. ఇక తను ప్రభాస్ తో చేసిన సాహో సినిమా ఆశించిన మేరకు సక్సెస్ అయితే సాధించలేదు. కాబట్టి ఇప్పుడు ఓజీ సినిమాతో భారీ సక్సెస్ ను కొట్టి తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…