https://oktelugu.com/

Samantha: ఉద్యోగం ఇస్తా రమ్మంటున్న సమంత… అర్హతలు ఇవే, లక్కీ ఫెలో మీరే కావొచ్చు!

బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో స్టార్ హీరోయిన్ గా స్థిరపడింది. ఆమె ఫేమ్ నార్త్ కి కూడా పాకింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో నటించిన సమంత హిందీ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. అందుకే ఆమెకు అక్కడ కూడా ఆఫర్స్ వస్తున్నాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : May 11, 2024 / 12:01 PM IST

    Samantha

    Follow us on

    Samantha: సమంత తన ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చింది. తన వద్ద పని చేసేందుకు ఉద్యోగాలు ఇస్తాను అంటుంది. తగు అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చని తెలియజేసింది. విషయంలోకి వెళితే.. సమంత స్టార్ హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై హవా సాగిస్తున్నారు. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో ఆమె ఒకరు. సినిమాకు రూ. 5-6 కోట్లు సమంత తీసుకుంటారనే వాదన ఉంది. 2010లో వెండితెరకు పరిచయమైన సమంత 14 ఏళ్ల కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకుంది లేదు.

    బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో స్టార్ హీరోయిన్ గా స్థిరపడింది. ఆమె ఫేమ్ నార్త్ కి కూడా పాకింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో నటించిన సమంత హిందీ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. అందుకే ఆమెకు అక్కడ కూడా ఆఫర్స్ వస్తున్నాయి. ఆమె నటించిన హనీ బనీ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఇది సిటాడెల్ ఇంగ్లీష్ సిరీస్ కి ఇండియన్ వెర్షన్. వరుణ్ ధావన్ మరొక ప్రధాన పాత్ర చేస్తున్నాడు.

    ఇక ప్రక్క బిజీ యాక్ట్రెస్ గా ఉన్న సమంత మరో ప్రక్క వ్యాపారాలు సక్సెస్ఫుల్ గా నడుపుతుంది. చాలా కాలం క్రితమే సమంత సాకీ పేరుతో ఒక ఫ్యాషన్ బ్రాండ్ ఏర్పాటు చేసింది. గార్మెంట్ ఇండస్ట్రీలోకి ఆమె అడుగుపెట్టారు. సమంతకు చెందిన ఈ సంస్థలో పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఫ్యాషన్ డిజైన్ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్, ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్, బ్రాండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఈ కామర్స్, సోర్సింగ్ & మర్చండైజ్ పొజీషన్స్ కి సమంత దరఖాస్తులు ఆహ్వానించింది.

    ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు సాకీ సంస్థలో పని చేసేందుకు అప్లై చేసుకోవచ్చు. సమంత తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఈ మేరకు ప్రకటన చేసింది. వివరాలు పొందుపరిచింది. ఇక సమంత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పరిశీలిస్తే… ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసింది. మొదటి చిత్రం కూడా ప్రకటించింది. మా ఇంటి బంగారం అనే చిత్రం స్వయంగా నిర్మిస్తున్న సమంత, ఆమెనే లీడ్ రోల్ చేస్తుంది.