https://oktelugu.com/

‘బుట్టబొమ్మ’ క్రేజ్‌ క్రెడిట్‌ అంతా ఆయనదేనంట..!

అల్లు అర్జున్‌.. తెలుగు ఇండస్ట్రీ స్టైలిష్‌ స్టార్‌‌. సినిమా సినిమాకు తన రూపు మార్చుకుంటూ స్టైలిష్‌గా కనిపిస్తూ ఉంటారు. అందుకే.. ఆయన యూత్‌కి స్టార్‌‌ ఐకాన్‌ కూడా. ఆయన సినిమాల్లో వేసిన డ్రెస్సులనూ బయట యూత్‌ ఫాలో అవుతూ ఉంటుంది. ఆ స్టైలిష్‌ స్టార్‌‌ అల్లు అర్జున్‌ గతేడాది సంక్రాంతి టైంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో యూత్‌ను మరోసారి మెస్మరైజ్‌ చేసేశాడు. ముఖ్యంగా అందులోని సాంగ్స్‌ స్పెషల్‌గా నిలిచాయి. Also Read: క్రాక్‌ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 4, 2021 / 03:19 PM IST
    Follow us on


    అల్లు అర్జున్‌.. తెలుగు ఇండస్ట్రీ స్టైలిష్‌ స్టార్‌‌. సినిమా సినిమాకు తన రూపు మార్చుకుంటూ స్టైలిష్‌గా కనిపిస్తూ ఉంటారు. అందుకే.. ఆయన యూత్‌కి స్టార్‌‌ ఐకాన్‌ కూడా. ఆయన సినిమాల్లో వేసిన డ్రెస్సులనూ బయట యూత్‌ ఫాలో అవుతూ ఉంటుంది. ఆ స్టైలిష్‌ స్టార్‌‌ అల్లు అర్జున్‌ గతేడాది సంక్రాంతి టైంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో యూత్‌ను మరోసారి మెస్మరైజ్‌ చేసేశాడు. ముఖ్యంగా అందులోని సాంగ్స్‌ స్పెషల్‌గా నిలిచాయి.

    Also Read: క్రాక్‌ సినిమా టీం ఆలోచన సక్సెస్‌ తెచ్చిపెట్టేనా

    ‘అల వైకుంఠపురములో’.. సినిమా రిలీజ్‌ అయి ఈ సంక్రాంతికి సరిగా ఏడాది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్‌ బ్లాస్టర్‌‌గా నిలిచింది. ఇండస్ట్రీ హిట్‌ కొట్టింది. ఇక.. ఈ సినిమాకు తమన్‌ అందించిన పాటలు ప్రత్యేక ఎస్సెట్‌. ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. ముఖ్యంగా ఈ సినామాలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్‌.. దానికి బన్నీ వేసిన స్టెప్పులు అందరినీ అలరించాయి.

    Also Read: సింగర్ గా మారుతున్న వింక్ బ్యూటీ.. గాత్రంతో మాయ చేస్తుందా..?

    ‘బుట్టబొమ్మ’ సాంగ్‌ అంతగా విజయవంతమవడానికి అస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా కారణమని బన్నీ తాజాగా చెప్పాడు. సమంత హోస్టింగ్ చేస్తున్న ‘సామ్ జామ్’ షోలో బన్నీ పాల్గొన్నాడు. కొత్త సంవత్సరం కానుకగా ఈ కార్యక్రమం స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ సందర్భంగా ‘బుట్టబొమ్మ’ పాట గురించి బన్నీ స్పందించాడు. ‘ఆ పాట అంత సక్సెస్ కావడంలో యూనిట్ సభ్యులకు ఎంత క్రెడిట్ ఉందో అంతే సమానమైన క్రెడిట్ వార్నర్‌కు కూడా ఉంది. టిక్‌టాక్ ద్వారా ఆ పాటను వార్నర్ వైరల్ చేశాడు. ఇటీవల జరిగిన సిరీస్ సందర్భంగా స్టేడియంలో కూడా వార్నర్ ‘బుట్టబొమ్మ’ స్టెప్ వేయడం ఆశ్చర్యం కలిగించింది’ అని బన్నీ పేర్కొన్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్