
‘వకీల్ సాబ్’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఫుల్ జోష్ లో ఉంది యూనిట్. ముఖ్యంగా.. తన డ్రీమ్ హీరోతో బంపర్ హిట్ కొట్టానని సంబరాల్లో ఉన్నారు దిల్ రాజు. ఇక, దర్శకుడు వేణు శ్రీరామ్ మరింత ఆనందంగా ఉన్నారు. ఏకంగా పవర్ స్టార్ తోనే ఇండస్ట్రీని షేక్ చేసే హిట్ కొట్టినందుకు గాల్లో తేలిపోతున్నారు. అయితే.. ఈ హ్యాపీ మూడ్ లోనే మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
అల్లు అర్జున్ తో ‘ఐకాన్’ సినిమా రూపొందించబోతున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. అది కూడా దిల్ రాజు బ్యానర్లో. దీంతో.. వకీల్ సాబ్ కాంబో మళ్లీ రిపీట్ కాబోతోందన్నమాట. ‘పుష్ప’ టీజర్ రిలీజ్ సమయంలో బన్నీని ‘ఐకాన్’ స్టార్ గా మార్చాడు సుకుమార్. ఇప్పుడు ఇదే టైటిల్ తో సినిమా అనౌన్స్ కాబోతోంది.
పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివతో సినిమా చేయాల్సి ఉంది. కానీ.. పుష్ప డిసెంబర్ వరకు వాయిదా పడింది. దీంతో.. ఆచార్య తర్వాత బన్నీతో సినిమా చేయాల్సిన కొరటాల.. జూనియర్ ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఆ సినిమా ఫినిష్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ దగ్గరకు వస్తాడట కొరటాల.
అందుకే.. వేణు శ్రీరామ్ లైన్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా ఐకాన్ విషయమై డిస్కషన్స్ కూడా జరిగాయని తెలుస్తోంది. మొత్తానికి.. దిల్ రాజు, వేణు శ్రీరామ్ ఫుల్ జోష్ లో ఉండగానే.. మరో క్రేజీ ప్రాజెక్టు పట్టాలెక్కించే పని మొదలైందన్నమాట.