Homeఎంటర్టైన్మెంట్చరణ్ తరువాత రణ్ వీర్ సింగ్ తోనే !

చరణ్ తరువాత రణ్ వీర్ సింగ్ తోనే !

Ranveer Singh Shankar
విజువల్ డైరెక్టర్ శంకర్ తన తరువాత సినిమాని రామ్ చరణ్ తో చేయబోతున్నాడని వార్త రాగానే మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. పాన్ ఇండియా డైరెక్టర్స్ లో శంకర్ ది ముఖ్యమైన స్థానం. రాజమౌళికి ఓ దశలో పోటీ ఇచ్చిన ఏకైక డైరెక్టర్. అలాంటి దర్శకుడితో తమ అభిమాన హీరో సినిమా చేస్తే.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అని అభిమానులు ఆశ. పైగా వీరి సినిమా పై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తారు. జులైలో షూటింగ్ మొదలవుతుంది. మొత్తానికి పక్కా ప్లాన్ తో ఈ సినిమాకి అన్ని సెట్ అయ్యాయి.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి డైలాగ్ వెర్షన్ నడుస్తోంది. శంకర్, రైటర్ బుర్రా సాయి మాధవ్ తో కలిసి డైలాగ్ వెర్షన్ మీద కూర్చుంటున్నారు. అలాగే మరో రచయిత అబ్బూరి రవి కూడా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా పై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శంకర్ ఈ కథను గతంలో ఒక హీరోకి చాల సార్లు చెప్పాడని.. కానీ ఆ హీరోకి కథ నచ్చకపోవడంతో శంకర్ తో సినిమా చేయడానికి ఒప్పుకోలేదు అని.. మరి అలాంటి కథను చరణ్ ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఇంతకీ శంకర్ గతంలో ఏ హీరోకి చెప్పాడు అంటే.. రణ్ వీర్ సింగ్ కి.

రణ్ వీర్ సింగ్ తో ఒక బాలీవుడ్ సినిమా తీయాలని శంకర్ అప్పట్లో బాగానే ప్రయత్నాలు చేశాడు. కానీ అప్పుడు అది మెటియరలైజ్ కాలేదు. ఆ తరువాత ‘అపరిచితుడు’ సినిమాని కొంచెం మార్చి హిందీలో పెద్ద ఎత్తున తీయాలని ప్లాన్ చేసాడు. రణ్ వీర్ సింగ్ కూడా అప్పుడు అపరిచితుడు సినిమాకి ఓకే చెప్పాడు. ఐతే, ఆ సినిమా ఈ ఏడాదే మొదలవుతుందంటూ తాజాగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బహుశా చరణ్ తో సినిమా తరువాత శంకర్, రణ్ వీర్ సింగ్ తో సినిమా చేస్తాడేమో.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular