https://oktelugu.com/

బన్నీ పిల్లల ‘ఫ్రైడే నైట్ డ్యాన్స్ పార్టీ’ వైరల్..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో ఎంత బీజీగా ఉన్నప్పటికీ కొంత సమయాన్ని సోషల్ మీడియాకు కేటాయిస్తూ ఉంటాడు. తన సినిమాలకు సంబంధించిన విషయాలతోపాటు.. పర్సనల్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ అభిమానులను ఎంటటైన్ చేస్తుంటాడు. ఖాళీగా సమయం దొరికితే చాలు బన్నీ తన భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటాడని అందరికీ తెల్సిందే..! Also Read: ఆర్ఆర్ఆర్’ పై లొల్లి షూరు చేసిన ఆదివాసులు..! వీటికి సంబంధించిన పిక్స్.. వీడియోలను బన్నీ ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2020 / 12:50 PM IST
    Follow us on

    స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో ఎంత బీజీగా ఉన్నప్పటికీ కొంత సమయాన్ని సోషల్ మీడియాకు కేటాయిస్తూ ఉంటాడు. తన సినిమాలకు సంబంధించిన విషయాలతోపాటు.. పర్సనల్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ అభిమానులను ఎంటటైన్ చేస్తుంటాడు. ఖాళీగా సమయం దొరికితే చాలు బన్నీ తన భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటాడని అందరికీ తెల్సిందే..!

    Also Read: ఆర్ఆర్ఆర్’ పై లొల్లి షూరు చేసిన ఆదివాసులు..!

    వీటికి సంబంధించిన పిక్స్.. వీడియోలను బన్నీ ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తుంటాడు. తాజాగా బన్నీ తన ఇన్ స్ట్రాగ్రాంలో ఓ వీడియోను పోస్టు చేయగా అదికాస్తా వైరల్ గా మారింది. బన్నీ కూమారుడు.. కూతురు ‘ఫ్రైడే నైట్ డ్యాన్స్ పార్టీ’ పేరుతో టీవీ చూస్తూ డాన్స్ చేశారు. చాలా ఫన్నీగా ఉన్న ఈ వీడియో అభిమానులను అలరిస్తోంది. దీంతో ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

    గతంలోనూ బన్నీ తన కూతురుతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా అప్పట్లో వైరల్ అయింది. ‘నీ ఫేవరేట్ కలర్ ఎంటీ బే అన్ని బన్నీ తన కూతురును అడుగగా.. పింక్ బే.. అంటుంది.. సొంత తండ్రి బే అంటవా? అంటూ బన్నీ తన కూతురుతో అనగా అవును బే అంటూ సమాధానం ఇస్తుంది.. దీంతో నీకసలు భయం లేదని బన్నీ అంటాడు..’ ఈ వీడియో అప్పట్లో వైరల్ అయింది.

    Also Read: ‘బిగ్ బాస్’లో మరో వైల్డ్ కార్డు ఎంట్రీ.. కానీ..!

    ఇటీవల బన్నీ తన భార్య స్నేహ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెబుతూ కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోలు కూడా నెట్టింట్లో హల్చల్ చేశాడు. ఇక తాజాగా ‘ఫైడే నైట్ డాన్స్ పార్టీ’ వీడియో వైరల్ అయింది. ఇదిలా ఉంటే అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం బన్నీ ఢిపరెంట్ లుక్కులోకి మారిపోయాడు. ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.