https://oktelugu.com/

రైతు ఉద్యమంలోకి లోకేష్‌

వయోభారం నేపథ్యంలో పార్టీ నుంచి సైడ్‌ అయిపోయి తన కుమారుడు లోకేష్‌ను తెరపైకి తెస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. దీంతో ఇన్నాళ్లు ట్విటర్‌‌ వేదికగా రాజకీయాలు నడిపించిన లోకేష్‌ కాస్త.. ఇప్పుడు ప్రజల మధ్య తిరుగుతున్నాడు. దీంతో టీడీపీ క్యాడర్‌‌ కాస్త ఆనందంలో ఉంది. పెద్ద బాబు గారు రాకున్నా.. చినబాబు సమస్యలపై పోరాడుతున్నారని సంబరపడిపోతున్నారు. కానీ.. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ భవిష్యత్‌ మాత్రం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి చేతిలో ఉన్నట్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2020 / 12:45 PM IST
    Follow us on

    వయోభారం నేపథ్యంలో పార్టీ నుంచి సైడ్‌ అయిపోయి తన కుమారుడు లోకేష్‌ను తెరపైకి తెస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. దీంతో ఇన్నాళ్లు ట్విటర్‌‌ వేదికగా రాజకీయాలు నడిపించిన లోకేష్‌ కాస్త.. ఇప్పుడు ప్రజల మధ్య తిరుగుతున్నాడు. దీంతో టీడీపీ క్యాడర్‌‌ కాస్త ఆనందంలో ఉంది. పెద్ద బాబు గారు రాకున్నా.. చినబాబు సమస్యలపై పోరాడుతున్నారని సంబరపడిపోతున్నారు. కానీ.. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ భవిష్యత్‌ మాత్రం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది.

    Also Read: చంద్రబాబుకు మోడీ రిటర్న్‌ గిఫ్ట్‌

    ఇదిలా ఉంటే.. ఇటీవల ఏపీలో వర్షాల కారణంగా భారీ నష్టం సంభవించింది. పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. వ‌ర్షాల‌తో న‌ష్టపోయిన రైతుల క‌ష్టాల‌ను తెలుసుకోడానికి అనంత‌పురం జిల్లాలోని గుంత‌క‌ల్లు, తాడిప‌త్రి, శింగ‌న‌మ‌ల‌, రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గాల్లో లోకేశ్ ప‌ర్యటించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వ్యవ‌సాయ  మోటార్లకు మీట‌ర్లు బిగిస్తే రైతు ఉద్యంమం త‌ప్పద‌ంటూ హెచ్చరించారు. బోర్లకు మీట‌ర్లు వ‌ద్దని రైతులు వేడుకుంటున్నార‌ని లోకేశ్ అన్నారు. ప్రభుత్వ ధోర‌ణి మార‌క‌పోతే అనంత‌పురం నుంచే రైతు ఉద్యమం ప్రారంభిస్తామ‌ంటూ చెప్పుకొచ్చారు.

    అయితే.. లోకేష్‌ మాటలతో చంద్రబాబు నిర్ణయంలో ఏమైనా మార్పు వస్తుందా..? లేక ఆ మాటలను లైట్‌ తీసుకొని ముందుకు వెళ్తారా..? కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తారా..? తెలియకుండా ఉంది. లోకేష్‌ ఇప్పుడిప్పుడే రాజకీయ పరిణతి సాధిస్తుండగా.. ఉద్యమ నేతగానూ మారబోతున్నాడు. అయితే.. అది కూడా ప్రభుత్వం సహకారంతోనే అని చెప్పొచ్చు. ఎలా అంటే.. జగన్ ప్రభుత్వం ఒకవేళ బోర్లకు మీటర్లు బిగిస్తే ఆయన అనంతపురం నుంచే ఉద్యమం ప్రారంభిస్తామని చెప్పారు. అంటే.. వైసీపీ వల్లే ఆయన ఉద్యమ నాయకుడు అవుతున్నట్లే కదా.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’పై కొనసాగుతున్న వివాదం.. రంగంలోకి ఆదివాసీలు..!

    ఇన్నాళ్లు ట్విటర్‌‌కే పరిమితమైన ఈ లీడర్‌‌.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెడుతున్నాడు. వచ్చీ రాగానే రైతు సమస్యలపై దృష్టి సారించడం ఆసక్తి కలిగిస్తోంది. అంతేకాదు.. ఈ పరిణామం కాస్త తమ్ముళ్లలో సంతోషాన్ని తెచ్చింది. మున్ముందు లోకేష్‌ రాజకీయ భవిష్యత్‌ ఎలా ఉండబోతోందో చూడాలి మరి.