Kanguva : ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన చిత్రాలలో ఒకటి తమిళ హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం. శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కోసం సూర్య తన మూడేళ్ళ విలువైన సమయాన్ని కేటాయించాడు. విడుదలకు ముందు మేకర్స్ కచ్చితంగా ఈ చిత్రం రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొడుతుందని బలమైన నమ్మకంతో మాట్లాడారు. బాలీవుడ్ లో కూడా హీరో సూర్య ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని టీం మొత్తం బలమైన నమ్మకంతో ఉన్నింది. కానీ విడుదలైన మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంటుందని మాత్రం వాళ్ళు ఊహించలేకపోయారు. కర్ణుడి చావుకి వెయ్యి కారణాలు అన్నట్టు, ఈ సినిమా ఫ్లాప్ కి వెయ్యి కారణాలు అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ఈ చిత్రంలోని నెగెటివ్ పాయింట్స్ ని చెప్పుకొచ్చారు నెటిజెన్స్.
దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రీ రికార్డింగ్ కారణంగానే ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చిందని చెప్పుకొచ్చారు. రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొడుతుందని చెప్పుకొచ్చిన ఈ సినిమా, వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని చేరుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. సూర్య స్థాయిలో ఉన్నటువంటి హీరోలందరూ ఇప్పుడు మొదటి రోజున వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అవలీలగా కొట్టేస్తున్నారు. సూర్య కి సౌత్ ఇండియా లో ఉన్నటువంటి మార్కెట్ కి టాక్ వస్తే వంద కోట్లు మొదటి రోజు కొట్టడం కాదు, రెండు వందల కోట్ల రూపాయిలను కూడా కొట్టగలిగే సత్తా ఆయనకి ఉంది. కానీ ఫుల్ రన్ లో వంద కోట్లు కొట్టడానికి ఇబ్బంది పడిందంటే ఈ చిత్రం ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టారు.
థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్, ఓటీటీ లో కూడా వస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ చిత్రానికి ఓటీటీ లో బంపర్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో జనాలు చూడకపోవడం వల్లనో ఏమో తెలియదు కానీ, ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో అప్లోడ్ చేసిన 24 గంటల్లోనే 15 లక్షల వ్యూస్ వచ్చాయట. ఇటీవల కాలం లో అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన అన్ని సౌత్ సినిమాలకంటే, ఈ సినిమాకే ఎక్కువ వ్యూస్ వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. మరి ఓటీటీ లో ఈ చిత్రానికి లాంగ్ రన్ లో ఏ రేంజ్ రన్ వస్తుందో, ఎన్ని రోజులు టాప్ 10 లో ట్రెండ్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ చిత్రం ఇండియా వైడ్ గా అమెజాన్ ప్రైమ్ లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది.