Homeఆంధ్రప్రదేశ్‌Vidadala Rajini : అడ్డంగా దొరికిన మాజీ మంత్రి విడదల రజినీ.. కూటమి నెక్స్ట్ స్టెప్...

Vidadala Rajini : అడ్డంగా దొరికిన మాజీ మంత్రి విడదల రజినీ.. కూటమి నెక్స్ట్ స్టెప్ ఏంటి?*

Vidadala Rajini : కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. దీంతో వైసిపి కీలక నేతల్లో ఒక రకమైన అలజడి నెలకొంది. అప్పట్లో కీలకంగా వ్యవహరించిన నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆ జాబితాలో మాజీ మంత్రి విడదల రజిని చేరారు. మంత్రిగా ఉన్న సమయంలో రజిని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. కూటమి ఏర్పడిన తర్వాత నేరుగా హోం మంత్రిని కలిసిన పలువురు రజనీపై ఫిర్యాదులు చేశారు. అప్పట్లో కొందరు పోలీస్ అధికారులు సైతం ఈ అవినీతిలో భాగస్వామ్యం అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపై విచారణ చేసిన విజిలెన్స్ అధికారులు తాజాగా రజిని అక్రమాలను తేల్చారు. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో తదుపరి చర్యల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయి ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఓ వ్యవహారంలో విడుదల రజిని రెండు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ అధికారులు.. అందుకు సహకరించిన వారి పేర్లను సైతం వెల్లడించారు.

* అప్పట్లో మంత్రిగా
ఏపీలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా రజిని మంత్రి పదవి దక్కించుకున్నారు. కీలకమైన వైద్య ఆరోగ్య శాఖకు ప్రాతినిధ్యం వహించారు. అయితే మంత్రిగా ఉన్నప్పుడు పోలీస్, మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారులను బెదిరించారని విజిలెన్స్ విచారణలో తేలింది. ఇందులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. చిలకలూరిపేట పరిధిలోని స్టోన్ క్రషర్ నిర్వహిస్తున్న యాజమాన్యం నుంచి వసూళ్లకు పాల్పడ్డారని కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. రజిని అనుచరులు సంబంధిత యాజమాన్యంతో చర్చలు జరిపారు అప్పట్లో. వాటాలు ఇచ్చేందుకు వారు అంగీకరించకపోవడంతో మైనింగ్ అధికారులతో కలిసి దాడులు చేశారు. 50 కోట్ల రూపాయల జరిమానా విధించారు. దీంతో వ్యాపారులు రాజీకి వచ్చారు. ఈ తరుణంలో పోలీసులు బెదిరించడంతో రెండు కోట్ల 20 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. అందులో రెండు కోట్లు మంత్రి రజనీకి ముట్ట చెప్పినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ విచారణలో ఇదే తేలింది.

* ఆ ఇద్దరికీ కూడా
అయితే రజని హయాంలో పీఏతో పాటు ఒక పోలీస్ అధికారి అవినీతి బాగోతం ఈ విచారణలో వెల్లడయింది. రెండు కోట్ల రూపాయల వరకు మంత్రి రజిని తీసుకోగా.. ఆమె పిఏ 10 లక్షల రూపాయలు తీసుకున్నట్లు తేలింది. మరోవైపు జాషువా అనే పోలీస్ అధికారికి సైతం 10 లక్షలు ముట్టినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి ఈ అవినీతి వ్యవహారంపై నివేదిక ఇచ్చారు. ఇక ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version