Bigg Boss 8 : ప్రతీ బిగ్ బాస్ సీజన్ లోనూ టైటిల్ విన్నర్ ఎవరు అనేది నాలుగు వారాల తర్వాత ఆడియన్స్ కి చాలా తెలియకగా అర్థమైపోతుంది. కానీ ఈ సీజన్ లో మాత్రం టైటిల్ విన్నర్ విషయం లో వచ్చినన్ని ట్విస్టులు ఏ సీజన్ లో కూడా రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొదటి ఆరు వారాలు నిఖిల్ హౌస్ మేట్స్ అందరి మీద చాలా స్పష్టమైన ఆధిక్యతని చూపించి నెంబర్ 1 స్థానం లో కొనసాగాడు. కచ్చితంగా ఆయనే టైటిల్ కొట్టబోతున్నాడు అని విశ్లేషకులు సైతం ఫిక్స్ అయిపోయారు. కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ హౌస్ లోకి అడుగుపెట్టారో సీన్ మొత్తం మారిపోయింది. వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టి మొదటి వారమే ఎలిమినేట్ అవ్వాల్సిన గౌతమ్ కృష్ణ, మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ కారణంగా సేవ్ తియ్యి, ఈ సీజన్ అసలు సిసలు ‘గేమ్ చేంజర్’ గా నిలిచి చరిత్ర సృష్టించాడు.
ఒక వైల్డ్ కార్డు కంటెస్టెంట్ కి ఈ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ రావడం అనేది బిగ్ బాస్ హిస్టరీ లో ఎప్పుడూ జరగలేదు, కేవలం ఒక్క గౌతమ్ విషయం లోనే జరిగింది. గౌతమ్ రైజ్ అవ్వడమే కాకుండా నిఖిల్ తో సరిసమానమైన ఓటింగ్ ని సంపాదించి టైటిల్ రేస్ లోకి దూసుకొచ్చాడు. మరో నాలుగు రోజుల్లో ఫినాలే జరగనుంది. విన్నర్ ఎవరో తెలియబోతుంది. కానీ ఇప్పటికీ టైటిల్ విన్నర్ ఎవరో ఊహించలేకపోతున్నారంటే, వీళ్లిద్దరి మధ్య ఓటింగ్ ఏ రేంజ్ లో జరుగుతుందో ఊహించుకోవచ్చు. ఒకరోజు నిఖిల్ టాప్ లో ఉంటే, మరో రోజు గౌతమ్ టాప్ లోకి వస్తున్నాడు. ఇలా టైటిల్ ఎవరు కొట్టబోతున్నారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం అయితే గౌతమ్ నిఖిల్ పై మూడు శాతం ఓటింగ్ తేడా తో టాప్ లో ఉన్నట్టు తెలుస్తుంది. నిఖిల్ ని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మంచి స్నేహితులు.
వీళ్ళు బయటకి వచ్చిన తర్వాత నిఖిల్ ని గెలిపించామని కోరుతూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆ కారణం చేత వాళ్ళ ఫ్యాన్ బేస్ మొత్తం కూడా నిఖిల్ కి ఓట్లు గుద్దేస్తున్నారు. కానీ గౌతమ్ కి మాత్రం ఎవ్వరి సపోర్టు లేదు. కేవలం తాను సంపాదించుకున్న ఫ్యాన్ బేస్ తోనే ఓట్లు రప్పించుకుంటున్నాడు. టైటిల్ రేస్ లోకి కూడా కేవలం తన సొంత బలంతోనే నిలిచాడు. ఇక గౌతమ్, నిఖిల్ తర్వాత మూడవ స్థానంలో ప్రేరణ, నాల్గవ స్థానంలో నబీల్ కొనసాగుతున్నారు. ఈ మూడవ స్పాట్ కి కూడా ప్రస్తుతం మంచి పోటీ ఉంది. నబీల్ కి ప్రేరణ తో పోలిస్తే సైలెంట్ ఓటింగ్ వేరే లెవెల్ లో ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఐదవ స్థానంలో అందరూ ఊహించినట్టుగానే అవినాష్ కొనసాగుతున్నాడు.