https://oktelugu.com/

ప్రభాస్ సినిమాలో ఇంజనీర్లకు బంఫర్ ఆఫర్ !

సినిమా అంటే ఒకప్పుడు పనికిమాలిన వాళ్ళు ఒక చోటుకు చేరి తీసేది అని సాధారణ ప్రజలు కామెంట్స్ చేసేవారు. కానీ, ఇప్పుడు సినిమా అంటే.. మేధావుల సమ్మేళనం. అయితే ఒక సినిమా మేకింగ్ కి ఇంజనీర్లతో పని ఉంటుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదు ? కానీ ఇప్పుడు ఇది కూడా సాధ్యం అవ్వబోతుంది. ప్రభాస్ తో తీయబోయే సైన్స్ ఫిక్షన్ మూవీ కోసం మెకానికల్, ఆటోమొబైల్, రోబోటిక్ ఇంజనీర్లను తీసుకోనున్నారు. ‘మాతో పని చేసేందుకు ఇంజనీర్లు కావాలి’ […]

Written By:
  • admin
  • , Updated On : June 25, 2021 / 05:31 PM IST
    Follow us on

    సినిమా అంటే ఒకప్పుడు పనికిమాలిన వాళ్ళు ఒక చోటుకు చేరి తీసేది అని సాధారణ ప్రజలు కామెంట్స్ చేసేవారు. కానీ, ఇప్పుడు సినిమా అంటే.. మేధావుల సమ్మేళనం. అయితే ఒక సినిమా మేకింగ్ కి ఇంజనీర్లతో పని ఉంటుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదు ? కానీ ఇప్పుడు ఇది కూడా సాధ్యం అవ్వబోతుంది. ప్రభాస్ తో తీయబోయే సైన్స్ ఫిక్షన్ మూవీ కోసం మెకానికల్, ఆటోమొబైల్, రోబోటిక్ ఇంజనీర్లను తీసుకోనున్నారు.

    ‘మాతో పని చేసేందుకు ఇంజనీర్లు కావాలి’ అంటూ తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ టీం, నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియా ద్వారా ఇంజనీర్లకి ఆహ్వానం పలికింది. ఇక ఈ ప్రాజెక్ట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కు మొదటినుండీ ఎక్కువ ఆసక్తి ఉండటంతో ఈ సినిమా నుండి ఏ ప్రకటన వచ్చినా తెగ వైరల్ చేస్తున్నారు.

    అన్నట్టు ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా నేపథ్యం మొత్తం ఓ దీవిలో జరుగబోతుందట. ఆ దివి తాలూకు సీన్స్ ఓ రేంజ్ లో తెరకెక్కించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఇక ఈ కథలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని, కచ్చితంగా తమ సినిమా అన్ని భాషల వారికి నచ్చే విధంగా ఉంటుందని నాగ్ అశ్విన్ చెప్పుకుకొచ్చాడు.

    పైగా ఈ సినిమాలో ప్రభాస్’కి అమ్మగా సీనియర్ స్టార్ హీరోయిన్ ‘రేఖ’ నటించబోతుంది. అలాగే అమితాబ్ కూడా నటిస్తున్నారు. అమితాబ్ కి భార్యగానే రేఖను తీసుకున్నారనేది బాలీవుడ్ మీడియా వర్గాల నుండి అందుతున్న అప్ డేట్. నిజంగా అమితాబ్ – రేఖ పెయిర్ కలిసి నటిస్తే.. ఆ రకంగా ఈ సినిమాకి బాగా ప్లస్ అవుతుంది.

    రేఖ పాత్ర విషయానికి వస్తే.. భర్త నుండి వీడిపోయాక కొడుకుని గొప్ప యోధుడిగా తీర్చిదిద్దిన గొప్ప తల్లిగా రేఖ కనిపించబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొను నటిస్తోంది.